Balayya Unstoppable 3: బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్3 మొదలయ్యే రోజు అప్పుడేనా?

Balayya Unstoppable 3: సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదివరకు ఈయన సినిమాలు మాత్రమే చేస్తూ ఎంతో బిజీగా ఉండేవారు. అయితే మొదటిసారి ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమైనటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇలా వ్యాఖ్యతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం సూపర్ హిట్ అయింది.

ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఎంతో మంచి రేటింగ్స్ సొంతం చేసుకుని నెంబర్ వన్ షోగా ఆదరణ సంపాదించుకుంది. దీంతో రెండవ సీజన్ కూడా ప్రారంభించారు.ఇలా ఈ కార్యక్రమానికి ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కావడం బాలకృష్ణ తనదైన స్టైల్ లో వారిని ప్రశ్నిస్తూ సమాధానాలు రాబట్టడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి మూడవ సీజన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 

ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్3 ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. అయితే ఈ కార్యక్రమం ఆలస్యం కావడానికి మరే కారణం లేదు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమా షెడ్యూల్ తోనే ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ కార్యక్రమం కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం.

 

అందుతున్న సమాచారం ప్రకారం అన్ స్టాపబుల్ సీజన్ 3 నవంబర్ మొదటివారం లేదా చివరి వారంలో ప్రసారం కాబోతుందని తెలుస్తుంది. అయితే ఈసారి ఎప్పటిలాగే సెలబ్రెటీలు మాత్రమే కాకుండా ఏ ఇంటర్వ్యూలకు హాజరు కాకుండా ముఖం చాటేస్తున్నటువంటి హీరోలను అలాగే యూట్యూబ్ స్టార్స్ ను ఈ కార్యక్రమానికి తీసుకురాబోతున్నారని తెలుస్తుంది. అయితే త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -