Gopichand: సింగింగ్ ఆఫర్ ఇచ్చిన గోపీచంద్.. మంచి మనస్సు అంటూ?

Gopichand: టాలీవుడ్ హీరోల్లో విలన్ గా గుర్తింపు పొంది హీరోలు అయిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో గోపీచంద్ ఒకరు. ఈ మధ్యకాలంలో గోపీచంద్ నటించిన సినిమాలు అంతగా ఆడటం లేదు. ఆయన సినిమాలు వరుసగా షాకిస్తున్నాయి. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే గోపీ చంద్ సినిమాలో కొన్ని సినిమాలు మంచి కంటెంట్ తో ఉన్నవిగా తెరకెక్కుతున్నాయి. సరైన టైంలో కొన్ని సినిమాలు రిలీజ్ కాకపోవడం వల్ల అవి అంతగా ఆకట్టుకోవడం లేదు.

 

ప్రస్తుతం గోపీచంద్ రామబాణం అనే సినిమాలో నటిస్తూ ముందుకు సాగుతున్నారు. గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయని చెప్పాలి. అయితే అన్ స్టాపబుల్ సీజన్2 కు గెస్ట్ గా హాజరైన గోపీచంద్ ఈ షోలో తన గురించి, తన సినీ బ్యాగ్రౌండ్ గురించి అనేక ఆసక్తికర విషయాలను తెలిపారు. ఈ షోలో పాల్గొన్న క్యాన్సర్ చిన్నారికి గోపీచంద్ బంపర్ ఆఫర్ ఇవ్వడం విశేషం. తన తర్వాత సినిమాలలో పాట పాడే అద్భుతమైన అవకాశాన్ని గోపీచంద్ ఆ చిన్నారికి ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు.

 

హీరో గోపీచంద్ లక్ష్మీ మనోజ్ఞ అనే చిన్నారికి తన వంతు సాయంగా పాట పాడే ఛాన్స్ కల్పించాడు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. గోపీచంద్ గ్రేట్ అంటూ నెటిజన్లు ఆయన్ని ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. లక్ష్మీ మనోజ్ఞకు బసవతారకం ఆస్పత్రిలో ఉచితంగా వైద్య చికిత్స అందేలా బాలయ్య తగు జాగ్రత్తలు తీసుకుని ఆమెకు అన్ని విధాలా సాయం చేస్తున్నారు.

 

లక్ష్మీ మనోజ్ఞ వాయిస్ అద్భుతంగా ఉండటంతో ఆమె స్టార్ సింగర్ అవుతారని బాలయ్య తెలిపాడు. నెటిజన్లు కూడా ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. లక్ష్మీ మనోజ్ఞ వల్ల ఈ ఎపిసోడ్ మరింత ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుందని ఇంకొంతమంది కామెంట్స్ చేయడం విశేషం.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -