Lord Shiva: శయనిస్తున్న శివుడు ఉన్న ఏకైక ఆలయం ఇదే.. దర్శించుకుంటే అంత పుణ్యమా?

Lord Shiva: శివుడు ఎప్పుడు మనకి లింగాకారంలోనే కనిపిస్తాడు అలా కాకుండా శ్రీమహావిష్ణువుల శయన భంగిమలో కనిపించే క్షేత్రం మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. ఇక్కడ మహాశివుడు సర్వమంగళ దేవి గుడిలో తలపెట్టుకొని శయనిస్తున్న భంగిమలో భక్తులకి దర్శనం ఇస్తాడు. పరమశివుడు కొలువైన క్షేత్రం ఆయన లీలా విశేషాలకి నిలయమైన క్షేత్రం సురుటపల్లి క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలోని సురటుపల్లి అనే గ్రామంలో ఉంది. ఎక్కడ శివుడు శయన భంగిమలో ఉంటాడు. శ్రీ మరగదాంబికా సమేత పల్లి కొండేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం.

శివుడు శయన భంగిమకు సంబంధించి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేసినప్పుడు ముందుగా హలహలం పుట్టింది. దాని నుంచి కాపాడమంటూ దేవతలు రాక్షసులు పరమేశ్వరుడిని వేడుకున్నారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై హలహలాన్ని మింగి తన కంఠంలో దాచుకున్నాడు. విష ప్రభావం వల్ల తూలిన శివుడు కొంతసేపు పార్వతి ఒడిలో సేద తీరుతాడు. ఆ క్షేత్రమే ఈ సూరుటుపల్లి. ఆ విషం గొంతులోనే ఉండిపోవటం వలన గొంతు బాగామంతా నీలం రంగులోకి మారిపోతుంది.

 

అప్పటి నుంచే శివుడు నీలకంటుడిగాను శ్రీమహావిష్ణువు నీలిమేఘశ్యామణిగాను ప్రఖ్యాతి చెందాడు. నారదుడు ముల్లోకాలకు ఈ సమాచారాన్ని అందేయడంతో నీలకంఠుడికి స్వస్థత చేకూర్చాలని స్వర్గణమంతా సురటపల్లికి చేరింది అలా తరలివచ్చిన దేవగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని నందీశ్వరుడు నిలువరించాడు. విషయం తెలుసుకున్న శివుడు మేలుకొని దేవతలకు దర్శన భాగ్యం ఇచ్చాడు. దేవతలందరూ పరమేశ్వరున్ని కృష్ణపక్ష త్రయోదశి నాడు దర్శించుకున్నారనే కథనాన్ని శివపురాణం చెబుతుంది.

 

సురులు దిగివచ్చిన ప్రాంతం కనుక సూర్యులపల్లి అనే పేరు వచ్చింది కాలక్రమమైన వాడుకలో సురటపల్లిగా మారింది. ఇక్కడ పరమేశ్వరుడుని నీలకంటుడిగాను శ్రీకంతుడిగాను నంజుండ స్వామి గాను పండుకుండేశ్వర స్వామి గాను భక్తులు కొలుస్తారు. పంచామృతంతో అభిషేకం చేస్తే ఆరోగ్య ప్రాప్తి పాలతో అభిషేకం చేస్తే దీర్ఘాయువు పెరుగుతాభిషేకం చేస్తే సతసంతానము కలుగుతుందని ప్రతీతి. దీనిని దర్శించుకున్నంత మాత్రాన్నే అపార పుణ్యం లభిస్తుందని స్థల పురాణం చెప్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -