Pawan Kalyan: టీడీపీ ఒక మాట అన్నా నొచ్చుకోవద్దు బాధ పడొద్దు.. పవన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Pawan Kalyan: చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. చంద్రబాబు నాయుడు పక్క ఆధారాలతో అరెస్ట్ కావడం జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఖరారు చేసుకోవడం చూస్తుంటే రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు రాబోతున్నాయని తెలుస్తోంది. అన్యాయంగా చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేశారని ఇలాంటి పాలన కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసమే తాము ఒకటయ్యా మంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ పొత్తు గురించి మాట్లాడుతూ పలు విషయాలను కూడా తెలియజేశారు. మనం ఆపదలో ఉన్న వారికి సహాయం అందిస్తున్నామంటే మనకు కొమ్మలు వచ్చాయని కాదు అర్థం. ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక్క మాట కూడా అనవద్దు అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు ఏదైనా అంటే బాధపడదు అంటూ జనసేన అభ్యర్థులకు ఇటు తెలుగుదేశం అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ సూచించారు.

ఇక ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జనసేన తెలుగుదేశం పార్టీకి తూట్లు పడేలా ఎవరు వ్యవహరించవద్దు అంటూ పవన్ కళ్యాణ్ సూచించారు.. ఇక జగన్ ప్రభుత్వాన్ని ముందు అధికారం నుంచి తొలగించిన తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు రాజు ఎవరి మంత్రి అనే విషయాల గురించి తర్వాత చర్చించుకుందాం అని ఈ సందర్భంగా పవన్ తెలిపారు.

తాను లోకేష్ బాలకృష్ణ గారి మధ్య నిలబడి మాట్లాడినంత మాత్రాన మనం ఏదో పెరిగిపోయామని ఉప్పొంగిపోకూడదు మన మద్దతుదారులకు గౌరవం ఇవ్వాలి ప్రజలందరూ కూడా పొత్తుకు సిద్ధమయ్యారు. కానీ నాయకులు మాత్రం ఈగో లకు వెళ్లదు 40 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత ఒక మాట అన్న కూడా ఎవరు నొచ్చుకోవద్దు. అందరం కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిద్దాం అంటూ ఈ సందర్భంగా పవన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -