Tiger 3 Trailer: దేశం కోసం పంజా విసురుతున్న పంజా3.. సల్మాన్ ఖాన్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమా?

Tiger 3 Trailer: బాలీవుడ్ కి ఇటీవల కాలంలో మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. పఠాన్, జవాన్ సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ల హిట్ అవ్వడంతో దెబ్బకు బాలీవుడ్ కు కొత్త జోష్ వచ్చేసింది. ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు దక్కడంతో ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్లు అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరి కళ్ళు టైగర్ 3 పై ఉన్నాయి. యష్ రాజ్ స్పై సిరీస్ లో భాగంగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీని హిందీ తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నారు.

రిలీజ్ డేట్ సస్పెన్స్ కి చెక్ పెడుతూ నవంబర్ 12 ఆదివారం థియేటర్లలో దింపడానికి ముహూర్తం నిర్ణయించారు. దేశం కోసం ఎంత ప్రమాదకరమైన మిషన్ అయినా సరే దాన్ని పూర్తి చేయడానికి రిస్క్ తీసుకునే గూఢచారి టైగర్. భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతునే ఎప్పుడు అవసరమైనా డ్యూటీకి సిద్ధంగా ఉంటాడు. ఇతని వల్ల దెబ్బ తిన్న పాకిస్థాన్ తీవ్రవాది పన్నిన కుట్ర వల్ల టైగర్ పద్మవ్యూహంలో చిక్కుకుంటాడు. దేశద్రోహిగా ముద్రపడి స్వంత వాళ్లతోనే ఛీ కొట్టించుకునే పరిస్థితి తలెత్తుంది. అవమానం పడిన చోటే తానేంటో నిరూపించుకోవడానికి కంకణం కట్టుకున్న టైగర్ ఏకంగా పాక్ కి వెళ్లి శత్రువు ఎదురు నిలబడతాడు.

ఇది ఈ సినిమా అసలు స్టోరీ. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తుండగా కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. జవాన్, పటాన్ సినిమా తర్వాత వస్తున్న అతిపెద్ద సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇందులో కళ్లుచెదిరిపోయే రీతిలో దర్శకుడు మనీష్ శర్మ విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి. అలాంటి విజువల్స్ ఎప్పుడూ చూడలేదనే ఫీలింగ్ కలగకపోయినా భారీతనం అంతకంతా పెరిగిపోయి హాలీవుడ్ స్టాండర్డ్ ని తీసుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -