Deepika Padukone: షారుక్ కంటే హృతిక్‌తోనే బెట‌ర్ రొమాన్స్‌.. దీపికా పదుకొనే సంచలన వ్యాఖ్యలు వైరల్!

Deepika Padukone: దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న టీవీ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 8 త్వరలో టెలికాస్ట్ కానుంది ఈ క్రమంలో ఫస్ట్ ఎపిసోడ్ కి బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకొనే జంటగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో మంగళవారం విడుదల చేయగా అది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటివరకు ఏడు భాగాలుగా వచ్చిన ఈ కాఫీ విత్ కరణ్ కార్యక్రమాల్లో రణవీర్, దీపిక విడివిడిగా ఇతర నటులతో కలిసి పాల్గొన్నారు కానీ జంటగా పాల్గొనడం ఇదే మొదటిసారి.

ఈ సందర్భంగా కరణ్ జోహార్ మీకు రణవీర్ తో కాకుండా ఇండస్ట్రీలో ఎవరితో మంచి కెమిస్ట్రీ ఉందని భావిస్తున్నారు అని దీపికాని అడిగితే హృతిక్ తో మంచి బాండింగ్ ఉంటుందని అనుకుంటున్నాను, అతనితో స్క్రీన్ పై కూడా మంచి కెమిస్ట్రీ పండుతుంది అని చెప్పటంతో రణవీర్ ఖంగుతిన్నాడు. అయితే షారుక్ తో ఐదు సినిమాలు, రణబీర్ తో నాలుగు సినిమాలు చేసిన దీపిక వారిద్దరినీ కాదని హృతిక్ పేరు చెప్పటంపై కారణం ఏమైనా ఉంటుందా అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు.

ఇదిలా ఉండగా హృతిక్, దీపికా పదుకొనే మొదటిసారి ఫైటర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి త్వరలోనే రాబోతున్నారు. అయితే ఈ షోలో మరిన్ని పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నారు ఈ దంపతులు. 2015 సంవత్సరంలో నేను దీపికా నిశ్చితార్థం చేసుకున్నాము. ఆ తర్వాత మూడేళ్లకు వివాహం చేసుకున్నాం.

దీపికా కోసం మరొకరు రాకుండా ముందే సీట్లో చెప్పు పెట్టాను అని రణవీర్ సింగ్ చెప్పారు. వెంటనే దీపిక స్పందిస్తూ అడ్వాన్స్ బుకింగ్ అని నవ్వింది. కరణ్ జోహార్ రూపొందించిన రాఖీ ఔర్ రాణి కి ప్రేమ కహాని సినిమాలో రణబీర్ కపూర్ పోషించిన రాఖీ పాత్ర గురించి దీపిక అభిప్రాయాన్ని చెప్పమంటాడు కరణ్ జోహార్. నేను ఆ లక్షణాలు ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకున్నాను అంటూ స్వీట్ అండ్ షార్ట్ గా సమాధానం చెప్పింది దీపిక.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -