Niharika Konidela: నిహారికకు తన బావతో ఆ కారణంగా పెళ్లి ఫిక్స్ అంటూ ప్రచారం.. ఏం జరిగిందంటే?

Niharika Konidela: టాలీవుడ్ మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల కాలంలో నిహారిక పై వరుసగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది నిహారిక. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. జొన్నలగడ్డ చైతన్యతో ఇటీవలే విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. దీంతో మెగా అభిమానులు కూడా ఛాన్స్ దొరికితే చాలు నిహారిక పై దారుణంగా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.

నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత ఆమెపై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. వాటన్నిటినీ ఆమె చాలా సునాయసంగానే ఎదుర్కొంటోంది. నిహారిక వీటిని వేటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. అయితే ప్రస్తుతం నిహారిక తన అన్న వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలో బిజీ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. మెగా అభిమానులు సినీ అభిమానులు అందరూ కూడా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిన పెళ్లి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇలాంటి సమయంలో నిహారికపై ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నిహారిక ఆమె భర్తకు వదిలేసి విడాకులు ఇచ్చిన తర్వాత చాలామంది నిహారిక సాయిధరమ్ తేజ్ ని పెళ్లి చేసుకుంటుంది, వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ అనేక వార్తలు క్రియేట్ చేశారు. అయితే వాటిని నిహారిక గట్టిగా సమాధానం చెప్పేసింది. సాయిధరమ్ తేజ్ కేవలం దానికి బావ మాత్రమే ఇలాంటి ఆలోచనలు గాని అవివే మాకు లేవని ఆమె చెప్పుకొచ్చింది.

దాంతో ఆ విషయాన్ని పక్కన పెట్టేసారు జనం. ఇప్పుడు సోషల్ మీడియాలో నిహారిక, వైష్ణవ తేజ్ కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిహారిక వైష్ణవ తేజ్ ని బుగ్గ గిల్లుతున్నట్టు, చేతి మీద కొరికేస్తున్నట్టు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీనితో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కేవలం ఫోటోలు చూసి బావ మరదలు కలిసి భోంచేసినా, సరదాగా గిల్లుకున్నా వాటిని బట్టి పెళ్లి ఫిక్స్ చేసేస్తారా అంటూ కొందరు మెగా అభిమానులు మండి పడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -