Chandrababu Naidu: బుద్ధున్నోళ్లు వైసీపీలోకి వెళ్లి చావుదెబ్బ తింటారా.. టీడీపీ నేతలకు చంద్రబాబు ఇచ్చిన భరోసా ఇదే!

Chandrababu Naidu: ఎన్నికల ముందు రాజకీయ నాయకులు పార్టీలు మారడం సహజం. దీనికి రెండు కారణాలు ఉంటాయి. మొదటిది.. ఆ పార్టీలో ప్రాధాన్యం లేదని భావించినపుడు టైం చూసుకొని ఎన్నికల ముందు పార్టీ మారుతారు. రెండోది.. గాలిని చూసి పార్టీ మారుతారు. అంటే ఏ పార్టీ గెలుస్తుందో అని ముందస్తు అంచనాకు వచ్చి గెలిచే గూటికి చేరిపోతారు. టీడీపీ, జనసేన కూటమి గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. గ్రౌండ్ లెవల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. దీంతో.. వైసీపీ నేతలు టీడీపీ లేదా జనసేన వైపు చూస్తున్నారు. ఎక్కువ మంది సైకిల్ ఎక్కడానికే ట్రై చేస్తున్నారు. అయితే, ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. ఇప్పటికే టీడీపీలో ఒక్కో నియోజవర్గంలో 4 నుంచి 5 మంది టికెట్ ఆశిస్తున్నారు. అలా అని అందరికి టికెట్లు రావు. దీనికితోడు జనసేనతో పొత్తులో ఉన్నారు కనుక కొన్ని స్థానాలు ఆ పార్టీకి ఇవ్వాల్సి వస్తుంది. జనసేనకు టికెట్ కేటాయించిన స్థానాల్లో టీడీపీ నేతలు పని చేయడమే తప్ప ఫలితం ఆశించకూడదన్న గీతా సారాంశాన్ని పాటించాల్సిందే.

అసలే టీడీపీలో ఆశావహులు ఎక్కువ మంది ఉన్నారు. పొత్తులో జనసేన ఉంది. బీజేపీతో కూడా పొత్తు దాదాపు ఖరారు అయినట్టే ఉంది. కాబట్టి ఉన్నవారికే టికెట్లు కేటాయించడం కుదరదు. మరి వైసీపీ నుంచి వస్తే.. టీడీపీలో అసంతృప్తులు పెరిగే అవకాశం లేకపోలేదు. దీన్నే వైసీపీ అధినేత జగన్ క్యాచ్ చేసుకునే పనిలో పడ్డారు. టీడీపీలో అసమ్మతి నేతలకు గాలం వేస్తున్నారు. ఇప్పటికే కొందరితో టచ్‌లోకి కూడా వెళ్లారు. కానీ, టీడీపీ నేతలు ఎవరూ వైసీపీలో చేరడానికి సిద్దంగా లేరు. ఎందుకంటే.. గెలుపు గాలి టీడీపీ వైపే వీస్తుంది. టికెట్ కోసం ఓడిపోయే పార్టీలోకి వెళ్లడం మంచిది కాదని చాలా మంది భావిస్తున్నారు. అయితే, ఒకటో అరో మంది నాయకులు మాత్రం టీడీపీలో టికెట్ దక్కకపోతే వైసీపీ గూటికి చేరిపోవడం మంచిదని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

దీంతో.. చంద్రబాబునాయుడు అప్రమత్తం అయ్యారు. జిల్లాల వారీగా పార్టీ నేతలతో టెలీకాన్ఫిరెన్స్ నిర్వహిస్తున్నారు. టికెట్ దక్కని వారెవ్వరూ నిరుత్సాహపడ్డని చెబుతున్నారు. ఓడిపోయే పార్టీలోకి చేరి ప్రయోజనం ఉండదని సూచిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒకరకంగా న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. జనసేనతో కలిసిపోవాలని సూచిస్తున్నారు. అందరూ కష్టపడితేనే అధికారంలోకి వస్తామని.. అధికారంలోకి వస్తేనే ఎవరికైనా ఏమైనా పదవులు ఇవ్వగలుగుతామని చంద్రబాబు ఒక్కోనేతతో చెబుతున్నారు. దీంతో.. పార్టీ మారాలి అనుకునే వారంత తమ ఆలోచనను మార్చుకున్నట్టు తెలుస్తోంది. కదిరిరా సభలు ముగిసిన తర్వాత మరో ప్రజాచైతన్య యాత్రను చేపడతామని పార్టీ నేతలకు సూచించారు.

ఆ సభలను కూడా విజయవంతం చేయాలని తెలిపారు. మరో 50 రోజులు కష్టపడితే.. అధికారంలోని వస్తామనే నమ్మకాన్ని పార్టీ నేతలకు చంద్రబాబు ఇచ్చారు. పరిస్థితులు టీడీపీ అనుకూలంగా ఉన్నాయని.. వైసీపీపై విపరీమైన వ్యతిరేకత ఉందని చెప్పారు. దీంతో.. అంతా కలిసి పని చేయాలని సూచించారు. చంద్రబాబు మాటలకు పార్టీ మారాలనుకునే వారు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. దీంతో.. వైసీపీ వ్యూహం ఫలించలేదని ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -