Pawan Kalyan: బాబు ఫ్యాన్స్ సంతోషానికి కారణమైన పవన్ కళ్యాణ్.. ఆ కామెంట్లతో సంతోషమే అంటూ?

Pawan Kalyan: బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెంలో జెండా సభను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే .ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని రాబోయే ఎన్నికలకు ఎలా సంసిద్ధం కావాలి అనే విషయాలను వెల్లడించారు. ఇక ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని రావడంతో జనసేన పార్టీకి కేవలం 24 సీట్లు ఇచ్చారు అంటూ చాలామంది విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ఈ విమర్శలకు పవన్ కళ్యాణ్ గట్టిగానే సమాధానం చెప్పారు.

ప్రతి ఒక్కరు 24 సీట్లు మాత్రమే తీసుకున్నావు అంటూ చాలా విమర్శలు చేస్తున్నారు. తాను 24 సీట్లను మించి తీసుకుంటే నాయకులను పోషించే స్తోమత పార్టీకి ఉందా 1000 మందిని గుర్తుకు తీసుకువెళ్లే కార్యకర్తలు మన పార్టీలో లేరు. మన పార్టీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీ. మన పార్టీ అలాంటి నాయకులను తయారు చేసుకున్న సమయంలో వైసీపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందని అందుకే విజినరీ ఉన్నటువంటి నాయకుడితో పొత్తుకుదుర్చుకోవడం అనివార్యం అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.

చంద్రబాబు లాంటి ఒక లీడర్ రాష్ట్రానికి అవసరం ఎంతో ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. బాబు సీఎం గా ఉన్న సమయంలోనే క్లైమర్ మైన్ తో ఆయన వస్తున్న జీప్ పై తిరుపతిలో దాడి జరిగి ఆ జీప్ 16 అడుగులు ఎత్తున లేస్తే..ఆయన లేచి పదండి రాజకీయం చేద్దామని గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న ప్రజా నాయకుడు చంద్రబాబు నాయుడు అని తెలిపారు.

ఇలాంటి ఒక గొప్ప నాయకులతో కలిసి పని చేయడం ఎప్పటికీ తప్పు కాదని తెలిపారు. చొక్కాలు మడతపెట్టాల్సిన సమయం వచ్చింది అంటూ తన సైన్యానికి హింట్ ఇస్తున్న నాయకుడ్ని ఇప్పటి తరం చూస్తుంటే తనపై క్లైమోరే మైన్ తో దాడి జరిగిన చొక్కా దులుపుకుని వెళ్లి పోయిన నాయకుడ్ని ఆ తరం చూసింది అంటూ పవన్ బాబు గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంతోషాన్ని కలిగించింది. ఇలా పవన్ మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు సైతం ఎమోషనల్ అయ్యారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -