Kadapa: రంగంలోకి దిగిన ‘కడప’ వసూల్‌రాజా.. ఎన్నికల కోడ్ వచ్చినా వైసీపీ అక్రమాలు ఆగలేదుగా!

Kadapa: త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడమేకాకుండా ఎన్నికల కోడ్ కూడా అమలులో ఉంది. ఈ క్రమంలోనే బహిరంగ ప్రదేశాలలో అన్ని పార్టీలకు సంబంధించిన నేతల విగ్రహాలను మూసే ఉంచడం ఫ్లెక్సీలను తొలగించడం వంటివి చేస్తున్నారు అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ కూడా వైసిపి నేతల అక్రమాలకు ఆగడాలకు ఏమాత్రం కొదువులేదని తెలుస్తోంది.

ఈ విధంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ వేల కోట్ల విలువైన బెరైటీస్‌ నిల్వలున్న మంగంపేట ఏరియాలో జింపెక్స్‌ కంపెనీకి వంద ఎకరాల పందేరానికి రంగం సిద్ధం చేశారు. అయితే ఇదంతా చాలా ప్లానింగ్ పద్ధతి ప్రకారమే జరుగుతుందని తెలుస్తోంది. ఇలా ఈ కంపెనీకి 100 ఎకరాల భూమి ఇవ్వాలంటూ ప్రభుత్వం నుంచి వినతులు వస్తున్నప్పటికీ రెవెన్యూ శాఖ మాత్రం అందుకు ఒప్పుకోలేదు.

ఇలా రెవెన్యూ శాఖ ఒప్పుకోకపోవడంతో తమ వినతి పత్రం గురించి పునరాలోచన చేయాలి అంటూ కూడా ఉన్నత అధికారుల నుంచి రెవెన్యూ శాఖపై ఒత్తిడి వచ్చింది. సందట్లో సడేమియాగా ముఖ్యనేత వద్ద పనిచేస్తున్న వసూల్‌ రాజా కూడా రంగంలోకి దిగిపోయారు. ముఖ్యనేత చెప్పారంటూ ఆయన రెవెన్యూపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని తెలిసిందే.

కడప జిల్లా మంగంపేట బెరైటీస్‌ గనులకు ప్రసిద్ధి. ప్రపంచంలోనే అత్యధిక బెరైటీస్‌ నిల్వలున్న ప్రాంతంలో ఇది మూడో స్థానంలో ఉంది. ఇలా వేల కోట్ల విలువ చేసే ఈ భూములను ఇదే కంపెనీకి ఇవ్వాలంటూ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి చూస్తుంటే వారికి ఏ స్థాయిలో లాభాలు ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -