Election Commission: ఎన్నికల వేళ లక్ష రూపాయల నిబంధన.. ఈ రూల్ తో అన్ని పార్టీలకు ఇబ్బందేనా?

Election Commission: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఎన్నో కట్టుదిట్టమైనటువంటి చర్యలను తీసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన కొన్ని కీలక ఆదేశాలను కూడా జారీ చేశారు. ఎన్నికలు అంటేనే ఎక్కువగా డబ్బుతో ముడిపడి ఉంటుంది.

చాలామంది ఓటర్లను ప్రభావితం చేయడం కోసం డబ్బులను పంచుతూ ఉంటారు అయితే ఈ ఎన్నికలలో డబ్బును అరికట్టే ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే లక్ష రూపాయలకు మించి ఎవరైనా విత్ డ్రా చేసిన లేదంటే నగదును డిపాజిట్ చేసిన వెంటనే ఆరా తీయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేసింది.

ఎన్నికలపై డబ్బు ప్రభావాన్ని కట్టడి చేయడం కోసమే ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఒక బ్యాంకు నుంచి ఒక ఖాతాలో లక్ష రూపాయలు విత్ డ్రా అయినా లేదంటే క్రెడిట్ అయినా ఆ ఖాతా వివరాలను ఎన్నికల అధికారులు తెప్పించుకొని వాటిని విశ్లేషించే బాధ్యతను అప్పచెప్పారు. ఇక ఓకే బ్యాంకు నుంచి వివిధ ఖాతాలకు సొమ్ము బదిలీ చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి వీటిపై కూడా ఈసీ దృష్టి సారించిందని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -