YSRCP: వైసీపీ అధికార ప్రతినిధిలా ఆ ఐపీఎస్ కొత్త అవతారం.. అసలేం జరిగిందంటే?

YSRCP: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా వేడి రాజేస్తున్నాయి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అధికారపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఎంతోమంది ప్రభుత్వ ఉన్నత అధికారులు కొమ్ముకాస్తున్నారు. వైసిపి ప్రభుత్వానికి అనుకూలంగా వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినటువంటి ప్రతిపక్ష నేతలు ఇప్పటికే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో కొందరి అధికారులపై వేటుపడింది.

అయితే వైసిపి ముసుగులో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల రంగు బయటపడుతుంది. తాజాగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ అయినటువంటి కాంతి రానా కూడా ఇదే కోవకు చెందిన వారిని తెలుస్తుంది ఈయన పేరుకే పోలీస్ కమిషనర్ అయినప్పటికీ అచ్చం వైఎస్ఆర్సిపి ప్రతినిధుల వ్యవహరిస్తూ వైసిపి నేతలు చేస్తున్నటువంటి అరాచకాలకు కొమ్ముకాస్తూ వచ్చారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఈయన ముసుగులన్నీ తొలగించి అసలు నీలి రంగు బయటపడిందని చెప్పాలి.

వైకాపా ప్రతినిధుల అవతారం ఎత్తినటువంటి కాంతి రానా మీడియా, ప్రతిపక్ష నాయకుల పై వైకాపా నేతలు పదేపదే చేస్తున్నటువంటి ఆరోపణలను, ఫిర్యాదులలో లేని అంశాలను గుచ్చి గుచ్చి అక్షరాలలో పేర్చి వాటిని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతోనే ఈయన అసలు రంగు బయటపడింది. వైకాపాతో కుమ్మకయ్యారని అవియోగాలు ఎదుర్కొన్నటువంటి ఐపీఎస్ అధికారులు అందరి తరపున ఈయనే వత్తాసు పలుకుతూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

ఇలా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ విధులను నిర్వహిస్తూ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ ఏకంగా ప్రతిపక్ష నేతలు తమ గురించి ఆరోపణలు చేస్తున్నారు అంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతోనే ఈయన నీలిరంగు ముసుగులో ఉంటూ వారికి కొమ్ము కాస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -