Disability Employees: డిజేబులిటీ ఉద్యోగులకు ఎన్నికల విధులు.. ఇంతకంటే దారుణం ఉండదుగా!

Disability Employees: త్వరలోనే ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల విధులలో భాగంగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులను నియమిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఎన్నికల విధులలో భాగంగా డిజేబులిటీ ఉన్నటువంటి వారిని కూడా నియమించడం పట్ల అధికారులు ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా డిజేబులిటీతో బాధపడేవారు ఎన్నికల నిర్వహణలో భాగంగా ఒక ప్రాంతానికి వెళ్లడంతో అక్కడ సరైన అవకాశాలు లేకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇలాంటి తరుణంలోనే డిజేబులిటీతో బాధపడే వారికి ఎన్నికల విధులను నియమించకూడదని ఇప్పటికే ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. అయితే ఇవేమీ తమకు పట్టవు అన్నట్టుగా ఏకంగా 80% డిజేబులిటీతో బాధపడుతున్నటువంటి వారిని కూడా ఎన్నికల విధులకు వేయడం పట్ల పలువురు ఉద్యోగస్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఎన్నికల విధులలో భాగంగా 30 నుంచి 40% అంగవైకల్యంతో బాధపడే వారికి ఇలాంటి విధులకు పంపిన పెద్దగా నష్టమేమీ లేదు కానీ 50 శాతం అంగవైకల్యంతో బాధపడే వారికి ఎన్నికల విధులు నిర్వర్తించడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పాలి. అక్కడ వారికి సరైన వసతులు లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడతారో అర్థం చేసుకోవాలని తెలిపారు ఇప్పటికైనా ఇలా డిజేబులిటీతో బాధపడే వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘానికి లేఖలు రాస్తున్నారు.

మరి ఈ లేఖను పరిగణలోకి తీసుకొని ఎన్నికల సంఘం డిజేబులీటితో బాధపడే వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతున్నారా లేకపోతే కనీస మానవత్వం కూడా లేకుండా వారిని కూడా ఎన్నికల విధులకు వేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -