YS Jagan: జగన్ పై ఎక్కడ దాడి జరిగినా కుట్ర బాబే చేశారా.. బాబును ఓడించాలనే కుట్రలా?

YS Jagan: తనపై జరిగిన గులకరాయి దాడిపై సీఎం జగన్ తొలిసారిగా స్పందించారు. గుడివాడలో సోమవారం సాయంత్రం జరిగిన మేమంతా సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. దేవుడు దయవలన రాయి కంటి దగ్గర, కణత దగ్గర తగల్లేదు. అంటే దేవుడు మీ బిడ్డ విషయంలో మరింత పెద్ద స్క్రిప్ట్ రాసాడు అని అర్థం. వారు ఈ స్థాయికి దిగజారారు అంటే విజయానికి మనం మరింత చేరువలో ఉన్నామని, వారు మరింత దూరంగా ఉన్నారని అర్థం అంటూ రాయి దాడి నేపాన్ని మొత్తం చంద్రబాబుపై వేసేందుకు ప్రయత్నించారు.

ఇంకా తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ ఈ విధంగా మాట్లాడారు. పేదల భవిష్యత్తు కోసం నేను 130 సార్లు బటన్లు నొక్కాను, నాకోసం మీరు రెండుసార్లు బటన్లు నొక్కండి అని కోరారు. 58 నెలల పాలనలో ఎంతో చేశానని చెప్పుకునే ప్రయత్నం చేశారు. వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలతో పాటు ఫైబర్ గ్రిడ్, డిజిటల్ లైబ్రరీలు అంటూ టీడీపీ హయాంలో ప్రారంభించిన వాటిని కూడా తమ ఖాతాలో వేసేసుకున్నారు.

ఇకపోతే గుడివాడ సభకు జనాన్ని తరలించడానికి రాజమండ్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు సోమవారం ఎనిమిది గంటలకే పామర్రు చేరుకున్నాయి. సాయంత్రం నాలుగు దాటినా బస్సులో ఎవరు ఎక్కలేదు. దీంతో తాగడానికి నీరు కూడా లేక మండుటెండలో బస్సు డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది.

చల్లపల్లి నుంచి వస్తున్న రేపల్లె డిపోకు చెందిన బస్సుల్లో కనీసం నలుగురైనా లేకుండానే పామర్రు సెంటర్ మీదుగా గుడివాడ తరలించారు. గులకరాయి దాడి తర్వాత బస్సుయాత్రకు ఒక రోజు విరామం ప్రకటించిన సీఎం సోమవారం నుంచి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరిపల్లి నుంచి తన యాత్రను మళ్లీ ప్రారంభించారు. జగన్ పై జరిగిన దాడి నేపథ్యంలో బస్సు పై భాగంలో నలుగురు వ్యక్తులు బైనాక్యులర్లు పట్టుకొని పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -