Laal Singh Chaddha Review: లాల్ సింగ్ చడ్డా సినిమా రివ్యూ

ఇండియన్ స్క్రీన్ మీద ఆమిర్ ఖాన్ సినిమాలకు ఉండే డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలకు అభిమానులు ఎంత మంది ఉంటారో.. విమర్శించే వారు కూడా అంతే మంది ఉంటారు. ఆమిర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా లాల్ సింగ్ చడ్డాను నటించి, నిర్మించాడు. మరి ఈ చిత్రం తెలుగు వారికి ఏ మేరకు నచ్చిందో ఓ సారి చూద్దాం.

Laal Singh Chaddha Review

కథ

లాల్ సింగ్ చడ్డా అనే సినిమా ఫారెస్ట్ గంప్ అనే సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. 90వ దశకంలో వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేశాడు ఆమిర్ ఖాన్. ఎదిగీ ఎదగని ఓ వ్యక్తి.. తన జీవితాన్ని ఎలా జీవించాడు. అతనికి ఎదురైన అనుభవాలు ఏంటి? అనేది ఫారెస్ట్ గంప్‌లో చూపించాడు. వాటిని మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు. ఇందులో ఆమిర్ ఖాన్ స్వాతిముత్యంలో కమల్ హాసన్ టైపు. కాళ్లు కూడా సరిగ్గా పని చేయవు. అలాంటిది లాల్‌కి ఒక రోజు కాళ్లు వస్తాయి. అప్పటి నుంచి అంతా పరిగెడుతూ ఉంటారు. ఈ ప్రయాణంలో కరీనా కపూర్ పాత్ర ఏంటి? నాగ చైతన్య కారెక్టర్ ఎలా మలుపు తిప్పుతుంది? అనేది కథ.

నటీనటులు

లాల్ సింగ్ చడ్డా పాత్రలో ఆమిర్ ఖాన్ అద్భుతంగా నటించేశాడు. ఆమిర్ ఖాన్ నటనకు వంక పెట్టగల వారెవ్వరూ లేరు. ఆమిర్ నటన ఈ చిత్రానికి ప్లస్ అవుతుంది. ఇక కరీనా కపూర్ తన పాత్రలో బాగానే నటించింది. ఎటొచ్చి నాగ చైతన్య పాత్రకే అంత ఇంపార్టెన్స్ లేనట్టుగా కనిపించింది. మధ్యలోనే అంతమైపోయే పాత్రలో నాగ చైతన్య బాగానే మెప్పించాడు. ఇక మిగిలిన పాత్రలు ఎక్కువగా గుర్తుండవు.

విశ్లేషణ

90వ దశకంలోని పరిస్థితులను ఇప్పుడు చూపించాలనుకోవడం కాస్త సాహసమే. అప్పుడు ఉన్న పరిస్థితులు, నాటి ప్రేక్షకుల మైండ్ సెట్ ఇప్పటి వారికి ఉండకపోవచ్చు. పైగా అప్పటి అమెరికా పరిస్థితులు, దేశంలోని సమస్యలను అల్లుకుంటూ ఫారెస్ట్ గంప్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అప్పుడు అది ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. కానీ ఇప్పుడు మన ప్రేక్షకులకు అది అంతగా ఎక్కకపోవచ్చు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేశారు.

లాల్ పాత్ర పరిగెడుతూ ఉంటుంది. కానీ మనం మాత్రం లాల్ వెంట పరిగెత్తలేకపోతాం. ఆ ప్రయాణంతో మనం అంతగా కనెక్ట్ కాలేం. లాల్ నవ్వినా, ఏడ్చినా కూడా మనకు ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వదు. సోల్ లేకపోవడంతో ఈ చిత్రం అందరికీ కనెక్ట్ కాలేకపోతున్నట్టు అనిపిస్తుంది. అలా ఆమిర్ నటన ఈ చిత్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసినా.. అసలు కథ, కథనంలోనే పట్టు లేకపోవడంతో మధ్యలోనే తేలిపోయినట్టు అనిపిస్తుంది.

ఇక ఈ చిత్రం సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్‌లో ఈ సినిమా టాప్ నాచ్‌లా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా అనిపిస్తాయి. ఆమిర్ ఎక్కడా కూడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించినట్టు అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్
ఆమిర్ నటన

మైనస్ పాయింట్స్
ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం
స్లో నెరేషన్
నిడివి

రేటింగ్ 2/5

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -
ఇండియన్ స్క్రీన్ మీద ఆమిర్ ఖాన్ సినిమాలకు ఉండే డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలకు అభిమానులు ఎంత మంది ఉంటారో.. విమర్శించే వారు కూడా అంతే మంది ఉంటారు. ఆమిర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా లాల్ సింగ్ చడ్డాను నటించి, నిర్మించాడు. మరి ఈ చిత్రం తెలుగు వారికి ఏ మేరకు నచ్చిందో ఓ సారి చూద్దాం. Laal Singh...Laal Singh Chaddha Review: లాల్ సింగ్ చడ్డా సినిమా రివ్యూ