AmirKhan: ఆ గడ్డు పరిస్థితుల్ని జీవితంలో మరచిపోను.. అమీర్ షాకింగ్ కామెంట్స్.

AmirKhan: ఇటీవల లాల్ సింగ్ చద్దా మూవీతో భారీ ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న అమీర్ ఖాన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా తరువాత ఇప్పటికీ అమీర్ ఏ కొత్త ప్రాజెక్టు ఓకే చేయలేదు. ఇక ఓ స్పానిష్ మూవీ రీమేక్ మాత్రమే చేస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం అమీర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాను బాల్యంలో ఎదుర్కున్న పరిస్థితుల గురించి ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు అమీర్ ఖాన్. అప్పుడు అమీర్ కుటుంబం, వారి ఆర్ధిక పరిస్థితి ఒకానొక దశలో రోడ్డున పడే స్థితికి చేరుకున్నామని ఎమోషన్ అయ్యారు. ఇక ఆ పరిస్థితుల గురించి బయటి వారెవ్వరికీ తెలియదని.. అవి ఎప్పటికీ మరిచిపోలేని రోజులని ఒకింత ఉద్వేగానికి గురి అయ్యారు అమీర్.

ఆ సినిమా నిర్మాణంలో..
అమీర్ నాన్న లాకెట్ అనే సినిమాను నిర్మిస్తున్న రోజుల్లో.. ఆ సినిమాలో నటీనటులుగా సినీ ప్రముఖులను ఎంపిక చేయడం జరిగిందని, దాని వల్ల షూటింగ్ లు వాయిదా పడుతూ ఉండేవని ఆయన తెలిపారు. ఇక అప్పుడు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. సినిమా పూర్తి అయితే కానీ డబ్బులు చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బంది ఎదురయ్యిందన్నారు.

ఆ సమయంలో అమీర్ వయసు కేవలం 10 సంవత్సరాలేనని.. అప్పటి రోజులు తాను జీవితంలో ఇప్పటికీ మరిచిపోనని చెప్పుకొచ్చారు అమీర్ ఖాన్. అప్పు ఇచ్చిన వాళ్ళు తరచూ నాన్నను డబ్బులు అడిగేవారని గుర్తు చేసుకున్నారు. అంత చిన్న వయస్సులో అలాంటి సంఘటనలు ఎదుర్కోవడం వలన భాద్యత తెలిసివచ్చిందని ఈ సందర్బంగా అమీర్ తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -