Jharkhand: పెళ్లి వద్దని చెప్పిన యువతికి దారుణమైన శిక్ష?

Jharkhand: ఒకవైపు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కూడా మరొకవైపు మారుమూల పల్లెటూర్లలో మూఢనమ్మకాలను విడిచిపెట్టడం లేదు. మనుషుల పట్ల జాలి దయ, కరుణ అనేవి లేకుండా ఆ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా జరిగిన సంఘటన అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. ఆ ఘటన జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో పటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జోగిడిహ్ గ్రామంలో పంచాయితీ బోర్డు. తుగ్లకీ శాసనం పేరుతో ఒక బాలికకు గుండు గీయించారు. అనంతరం ఆ బాలికపై చెప్పుల దండ వేసి బూట్లతో దాడి చేసి బాలికను ఊరేగించారు.

ఆ బాలికను గ్రామం చుట్టూ తిప్పిన నిందితులు బాలికను గ్రామం వెలుపలికి తీసుకెళ్లి అడవిలో మరణించు అంటూ వదిలిపెట్టారు. సమాచారం అందుకున్న పటాన్‌ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు జోగిడిహ్‌ గ్రామానికి చేరుకుని బాధితురాలిని అడవి నుంచి సురక్షితంగా తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం మేదిని రాయ్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే.. గత నెల ఏప్రిల్ 19న అమ్మాయి పెళ్లిని ఆమె కుటుంబ సభ్యులు ఫిక్స్ చేశారు. వరుడు తరపు బంధువులు వరుడు పెళ్లి ఊరేగింపుగా అమ్మాయి ఇంటికి వచ్చారు. అయితే అప్పుడు ఆ అమ్మాయి పెళ్లికి నిరాకరించి ఇంటి నుంచి పారిపోయింది.

 

ఈ సంఘటన జరిగిన 20 రోజుల తరువాత ఈ అమ్మాయి తన ఇంటికి తిరిగి వచ్చింది. ఈ విషయమై గ్రామంలో గ్రామస్తులు పంచాయితీ పెట్టారు. ఆ అమ్మాయిని క్యారెక్టర్‌ లెస్‌గా అభివర్ణిస్తూ, ఊరిలోని మిగతా అమ్మాయిలు ఇలా ఇంటి నుంచి పారిపోకూడదని అందుకనే ఆ అమ్మాయికి పాఠం చెప్పాలని భావించారు. దీంతో అమ్మాయికి శిక్ష విధించిన పంచాయితీ బోర్డు ఆ అమ్మాయి జుట్టు గీసి గుండు చేశారు. బూట్ల దండ, చెప్పుల దండ వేసి, కొట్టి, గ్రామంలో ఊరేగించేలా చేశారు. మొత్తం గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రంలో పాల్గొన్నారు. అనంతరం ఆ యువతిని గ్రామం వెలివేశారు. ఊరి నుంచి బయటకు తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టారు. అమానవీయంగా ప్రవర్తించడంతో బాలిక మానసిక అస్వస్థతకు గురైంది. అయితే తన పట్ల జరిగిన అమానవీయ సంఘటనలో గ్రామస్తులతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ప్రమేయం ఉందని యువతి పోలీసులకు తెలిపింది. పోలీసులు 4 నుండి 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారిస్తున్నారు. ఈ ఘటనలో ప్రమేయమున్న మరికొందరిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -