Jharkhand: ప్రియురాలిని చీకట్లో కలవడానికి వెళ్లిన వ్యక్తి.. కానీ?

Jharkhand: ఇటీవల కాలంలో చాలా మంది పెళ్లయిన వివాహితలు భర్తలను కాదని వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇక అసలు విషయం బయటపడినప్పుడు భర్తకు నిజాన్ని తెలిసినప్పుడు కానీ భర్తను చంపడానికి కూడా వెనకాడడం లేదు. పురుషులు కూడా ఈ విధంగానే ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకొని భార్యలను చంపడానికి కూడా వెనకాడడం లేదు. అయితే తాజాగా అటువంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

ఉత్తర్ ప్రదేశ్‌, సోన్‌భద్ర జిల్లా పరిధిలోని సలైయాదీ గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు హరియానా లో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ అతడికి ఝార్ఖండ్‌లోని గఢ్వా ప్రాంతానికి చెందిన వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఆ యువకుడు ఆమెను తీసుకెళ్లిపోయి. హర్యానా లో ఓ గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. కొద్ది రోజులు వీరి సహజీవనం సజావుగా సాగింది. అయితే ఆ వివాహిత కనిపించక పోవడం అత్తింటివారు మిస్సింగ్ కేసు పెట్టడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను తిరిగి భర్తకు అప్పగించారు.

 

అయితే ఆ ఘటన జరిగిన తర్వాత కొద్దీ రోజులు బాగానే ఉన్న మహిళ, ప్రియుడు మళ్ళీ కలవడం మొదలు పెట్టారు. భర్త లేని సమయంలో ఆ మహిళా ప్రియుడితో ఎంజాయ్ చేయ సాగింది. ఆ మహిళ బాగోతాన్ని కుటుంబ సభ్యులు మహిళ ప్రియుడికి బుద్ధి చెప్పాలని అనుకున్నారు. తాజాగా ప్రియురాలిని కలిసేందుకు వచ్చిన అనిల్‌ ను కాపుకాసి పట్టుకున్నారు. అనంతరం అతడిని ఓ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. ఆపై ఒక పదునైన ఆయుధంతో అతడి నాలుకను సైతం కోసేశారు.

 

ఈ ఘటన జరిగాక ఎలాగోలా బయటపడ్డ యువకుడు మొత్తానికి ఇంటికి చేరుకున్నాడు. అయితే నోటి నుంచి రక్తం ధారాళంగా కారుతుండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు, అతడి నాలుకకు కుట్లు వేసి అతికించగలిగారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. యువకుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -