Mahesh Babu: ఆస్పత్రిలో మహేష్‌బాబు.. ఇంట్లో దొంగ!

Mahesh Babu: భద్రతా వైఫల్యమో, ఇంకేదో తెలిదు కానీ.. ప్రముఖులు, సినీ తారల ఇళ్లల్లోకి దుండగులు దూరి భయాందోళనకు గురి చేస్తున్నారు. బుధవారం మహేష్‌ బాబు ఇంట్లోకి ఓ ఆగంతకుడు దూరడం కలకలం రేగింది. మహేష్‌ బాబు ఇంట్లో దొంగతనం చేయడం కోసం ఒక దొంగ తీవ్ర ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. మహేష్‌ బాబు ఇంట్లో చోరీ చేయడం కోసం వచ్చిన ఒక దొంగ గోడ దూకి గాయాలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.మహేష్‌ బాబు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–81 భార్య నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతం, సితారలతో కలిసి మహేష్‌ చాలా కాలం నుంచి అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు.

అయితే మహేష్‌ ఇంటికి కన్నం వేస్తే భారీగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో అతని ఇంట్లో దొంగతనం చేయడానికి సిద్ధమైన ఒక దొంగ మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో చాకచక్యంగా కరెంట్‌ పెన్సింగ్‌ ఉన్న ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించాడు. అనుకున్నట్టే గోడ ఎక్కి దూకాడు కానీ అది బాగా ఎత్తుగా ఉండడంతో కింద పడటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. పెద్ద శబ్దం రావడంతో మహేష్‌ బాబు ఇంట్లో సెక్యూరిటీ గార్డులు శబ్దం వచ్చిన వైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక వ్యక్తి గాయాలతో పడి ఉండటంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని విచారించి హాస్పిటల్‌ కి తరలించారు.

పోలీసుల విచారణలో అతని పేరు కృష్ణ (30) అని తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ఒరిస్సా నుంచి వచ్చి హైదరాబాదులోనే ఒక నర్సరీ వద్ద ప్లాట్‌ఫాం మీద ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో మహేష్‌ బాబు ఇంట్లో లేరు. ఆ సమయంలో విఐజీ హాస్పిటల్లో మహేష్‌ బాబు ఉన్నారు. ఆయన తల్లికి తీవ్ర అస్వస్థత ఏర్పడడంతో మహేష్‌ బాబు హాస్పిటల్‌ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక అదే రోజు తెల్లవారుజామున మహేష్‌ తల్లి ఇందిరాదేవి మృతి చెందారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -