Pooja Hegde: ఆ సినిమా నుంచి తప్పుకోవడమే పూజా హెగ్డేకు వరమైందా?

Pooja Hegde: మాటల మాంత్రికుడు విక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి తాజా చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా నెల తిరగకుండానే ఓటీటీలో విడుదల అయింది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రావడంతో మరోసారి ఈ సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో శ్రీ లీల మీనాక్షి చౌదరి నటించిన సంగతి మనకు తెలిసిందే.

 

ఈ సినిమాలో ముందుగా శ్రీ లీల పూజా హెగ్డే ఈ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. శ్రీ లీల మీనాక్షి చౌదరి పాత్రలో నటించగా శ్రీ లీలా పాత్రలో పూజా హెగ్డేని ఎంపిక చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇలా పూజా హెగ్డే తప్పుకోవడంతో ఆమె పాత్ర శ్రీలీలకు శ్రీ లీల పాత్రలో మీనాక్షి చౌదరిని ఎంపిక చేసుకున్నారు.

ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఇందులో పూజా హెగ్డే కనుక నటించి ఉంటే సినిమా మరి కాస్త ఆయన బాగుండేది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం ఈ సినిమాలో పూజా హెగ్డే నటించకపోవడమే మంచిది అయిందని వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఈమె నటించిన సినిమాలు అన్ని వరుసగా డిజాస్టర్ కావడంతో ఐరన్ లెగ్ గానే ముద్ర వేసుకున్నారు.

 

ఇప్పుడు కనుక ఈ సినిమాలో నటించి ఉంటే ఈమె కెరియర్ పూర్తిగా పడిపోయదని తాను పూర్తిగా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చేదని తెలుపుతున్నారు. ఇలా ఈ సినిమాని రిజెక్ట్ చేసి చాలా మంచి పని చేశారు అంటూ అభిమానులు వారి అభిప్రాయాలను తెలిపారు. గుంటూరు కారం సినిమాని రిజెక్ట్ చేసి పూజా హెగ్డే చాలా మంచి పని చేశారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -