Jai Hanuman: మహేష్ ఖాతాలో మరో మూవీ.. జై హనుమాన్ లో రామునిగా కనిపిస్తారా?

Jai Hanuman: ఒకప్పుడు రాముడు పాత్రలో కృష్ణుడి పాత్రలో అంటే సీనియర్ ఎన్టీఆర్ కాకుండా వేరొకరిని ఊహించుకునే పరిస్థితి లేదు. అంతగా ఆ పాత్రలలో జీవించేసేవారు ఆయన. ఆ తర్వాత కూడా చాలామంది నటులు పౌరాణిక పాత్రలలో నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు పౌరాణిక సినిమాలే రావటం లేదు. అయితే లేటెస్ట్ గా వచ్చిన హనుమాన్ సినిమాలో పౌరాణిక పాత్ర అయిన విభీషణుడి పాత్రను పోషించి మెప్పించాడు సముద్రఖని.

 

హనుమంతుడి క్యారెక్టర్ ఉంది కానీ ఆ క్యారెక్టర్ కి సరిపడా పర్సనాలిటీ ఎవరు దొరకకపోవటంతో విఎఫ్ఎక్స్ తోనే హనుమాన్ క్యారెక్టర్ ని క్రియేట్ చేశాడు దర్శకుడు. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. అయితే హానుమాన్ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాని అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ.

అందులో హనుమంతుని పాత్రను విఎఫ్ఎక్స్ లో కాకుండా ఒరిజినల్ గా చూపిస్తేనే కథలో డెప్త్ ఉంటుంది అనుకున్న దర్శకుడు ఆ పాత్రకి రానా ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక ఇందులో శ్రీరాముని పాత్ర కోసం చూస్తున్నాడంట ప్రశాంత్ వర్మ. అయితే ఈ క్యారెక్టర్ సినిమాలో ఒకటి రెండు సీన్లకు మించి ఉండదు. అందుకే ఆ పాత్రని హైలెట్ చేయడం కోసం ఎవరైనా స్టార్ నటుడిని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాడంట ప్రశాంత్ వర్మ.

 

అయితే రాముడు పాత్రలో మహేష్ బాబుని తీసుకుంటే ఎలా ఉంటుంది దీనికి మహేష్ బాబు ఒప్పుకుంటారా లేదంటే ఎప్పుడూ చేయలేదు కాబట్టి ఇలాంటి క్యారెక్టర్ చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా అనే ఊహాగానాలు చేస్తున్నారు ప్రేక్షకులు. జై హనుమాన్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో హై బడ్జెట్ లో తీస్తారు కాబట్టి దీనికి మహేష్ బాబు క్యారెక్టర్ తోడైతే జై హనుమాన్ మూవీ రిజల్ట్స్ మరో రేంజ్ లో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -