Prabhas: ఆ విషయంలో ఫ్యాన్స్ గర్వపడేలా ప్రభాస్ చేయగలడా?

Prabhas: గుంటూరు కారం సినిమా చూసిన వాళ్ళు ఎవరూ మహేష్ బాబు డాన్స్ ని అంత త్వరగా మర్చిపోలేరు. శ్రీ లీల తో పాటు మహేష్ బాబు వేసిన స్టెప్స్ సినిమా మొత్తానికి హైలైట్ అని చెప్పాలి. అయితే ఇప్పుడు ప్రభాస్ కూడా తన ఫ్యాన్స్ కి ఒక మంచి డాన్స్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. నిజానికి మన టాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్స్ అందరూ బెస్ట్ డాన్సర్స్. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా ప్రతి ఒక్కరూ తమ డాన్సులతో అభిమానులను అలరించిన వారే.

 

నిజానికి ఒకప్పుడు డాన్సులు అంటే అక్కినేని నాగేశ్వరరావు గుర్తొచ్చేవారు ఆ తరువాత డాన్స్ లకి పెట్టింది పేరు, బ్రేక్ డాన్సులతో వెండితెరకి ఊపు తెచ్చిన పేరు మెగాస్టార్ చిరంజీవి. కేవలం ఆయన డాన్సులు చూడటం కోసమే సినిమాలకు వెళ్లే ఆడియన్స్ ఆ రోజుల్లో చాలామంది ఉండేవారు.

ఈ తరం హీరోల్లో చరణ్, బన్నీ, తారక్ ముగ్గురు డాన్సులతో దుమ్ము దులిపేస్తారు. ఈ విషయంలో మహేష్ బాబు కాస్త స్లో అనే చెప్పాలి.కానీ గుంటూరు కారం సినిమాలో మాత్రం మహేష్ బాబు ఓ రేంజ్ లో డాన్స్ ఇరగదీసేసాడు. బ్రహ్మోత్సవం టైం లో తన డాన్సుల విషయంలో వచ్చిన ట్రోల్స్ ని సీరియస్ గా తీసుకున్న మహేష్ ఇన్నాళ్లకు ఆ కసి తీర్చుకున్నాడు.ఇక ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ పైనే ఉంది.

 

నిజానికి యాక్టింగ్ లో అందరి చేత శభాష్ అనిపించుకున్న ప్రభాస్ ఒక ఊర మాసు డాన్స్ తో ఇప్పటివరకు ఏ సాంగ్ కూడా పర్ఫార్మ్ చేయలేదని చెప్పాలి. అందుకే మారుతీ డైరెక్షన్లో వస్తున్న రాజా సాబ్ సినిమాలో ఒక డాన్స్ ని ప్లాన్ చేస్తున్నడట. ఈ సాంగ్ లో ప్రభాస్ డాన్స్ ఫ్యాన్స్ కి నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

YCP Candidates: వైసీపీ అభ్యర్థులు అంతా పేదవాళ్లేనా.. అయ్యో ఇంత పేదవాళ్లకు టికెట్లు ఇచ్చారా?

YCP Candidates: పాపం.. వైసీపీ నేతలు అందరు పేదవాళ్లే.. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. ఇదే మేము అంటున్న మాట కాదండోయ్ వైసీపీ నేతలు వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న...
- Advertisement -
- Advertisement -