Pokiri: రిలీజై 20 ఏళ్లు అయినా పోకిరి క్రేజ్ తగ్గలేదుగా.. ఏమైందంటే?

Pokiri: పోకిరి సినిమా రిలీజ్ అయి ఇప్పటికే చాలా సంవత్సరాలు అయింది. అయినా ఆ సినిమా ఇప్పటికే చాలామందికి ఫేవరెట్ మూవీ. ఎంతగా అంటే ఆ సినిమాని ఒక రోగికి చూపిస్తూ మెలకువగా ఉండగానే ఆపరేషన్ చేశారు డాక్టర్లు. ఈ అరుదైన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం ఐలాపురానికి చెందిన పండు కాలు చేయి బలహీనపడి అపస్మారక స్థితికి చేరడంతో జనవరి 2 న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు.

 

న్యూరో విభాగం వైద్యులు పరీక్షలు చేసి మెదడులో ఎడమవైపు కుడికాలు కుడి చెయ్యి పనిచేసే నోటారకార్డెక్స్ భాగంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి ట్యూమర్ ని తొలగించే ప్రక్రియలో కుడికాలు కుడి చేయి చచ్చుబడి పోయే అవకాశం ఉందని భావించి రోగి మెలకువగా ఉండగానే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు.

ఆపరేషన్ కి పేషంట్ కూడా సహకరించడంతో అతని అభిమాన హీరో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాను లాప్టాప్ లో చూపిస్తూ జనవరి 25న బ్రెయిన్ సర్జరీ చేసి కణితి తొలగించినట్లు వివరించారు. జనవరి 25 న రోగికి లోకల్ అనస్తీషియా ఇచ్చి ఏవేకెన్ బ్రెయిన్ సర్జరీ చేశారు. పండు మహేష్ బాబు అభిమాని కావడంతో లాప్టాప్ లో పోకిరి మూవీ చూస్తూ విజయవంతంగా సర్జరీ ముగించారు.

 

రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రిలో ఇప్పటికే పదుల సంఖ్యలో ఈ తరహా ఆపరేషన్లు జరిగాయి కానీ ఏపీ ప్రభుత్వ రంగంలో మాత్రం తొలిసారిగా రోగి మెలకువలో ఉండగానే మెదడుకు ఆపరేషన్ చేసినట్లు గుంటూరు జి జి హెచ్ వైద్య వర్గాలు ప్రకటించాయి. అరుదైన ఆపరేషన్ చేసిన వైద్య బృందాన్ని జి జి హెచ్ సూపరిండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అభినందించారు. రోగి పూర్తిగా కోలుకోవటంతో డిస్చార్జి చేసినట్లు ప్రకటించారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -