Nithya Menen: ఆ భయం వల్లే నిత్యామీనన్ పెళ్లి చేసుకోవడం లేదా.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Nithya Menen: టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి మనందరికీ తెలిసిందే. మనిషి కాస్త పొట్టిగా ఉన్నా కూడా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా పలు సినిమాలను నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా సెకండ్ హీరోయిన్ గా కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. కొన్ని సినిమాలలో హీరో హీరోయిన్లకు ఫ్రెండ్ క్యారెక్టర్లలో కూడా నటించింది. ఎటువంటి పాత్ర ఇచ్చిన కూడా ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేయగల నటి నిత్యామీనన్. ఇక ఈమె అందం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కాగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్స్ లలో నిత్యామీనన్ టాప్ టెన్ ప్లేస్ లలో కచ్చితంగా ఉంటుంది. అలాంటి ఘనత అందుకున్న మలయాళీ బ్యూటీ ప్రెసెంట్ తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. కాగా చివరిగా తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సోషల్ మీడియాలో ఈమె పెళ్లికి సంబంధించి అనేక రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

ఒక స్టార్ డైరెక్టర్ తో ప్రేమాయణం నడుపుతోందని, కుర్ర హీరోతో ప్రేమలో పడింది అంటూ ఇలా చాలా రకాల వార్తలు వినిపించాయి. అయితే అవన్ని కూడా ఫేక్ అంటూ కొట్టి పడేసింది నిత్యామీనన్. అయితే పెళ్లి ఈడు వచ్చిన ఇంకా ఎందుకు నిత్యామీనన్ పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్న క్వశ్చన్స్ అభిమానులకు ఉన్నాయి. రీసెంట్గా తమిళ నటుడు విమర్శకుడు బైల్వాన్ రంగనాథన్ దీనిపై స్పందించాడు. నిత్యామీనన్ పెళ్లి అంటే భయపడిపోతుంది అని,గతంలో ఓ మలయాళీ నటి ప్రేమించి పెళ్లి చేసుకుని గృహహింసకు గురై వరకట్నపు వేధింపులకు బలైపోయి. ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని అది చూసాకే ఆమెకు పెళ్ళంటే విరక్తి ప్లస్ భయం రెండు ఏర్పడిపోయాయని చెప్పుకొచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -