Nithya Menen: ఆ సినిమా చేస్తుంటే నిత్య మినన్ రేంజే వేరు!

Nithya Menen: నిత్యామీనన్ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ రోజుల్లోనే స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ సినిమా చేసి మరింత హిట్ అందుకుంది. ఇక బుల్లితెరపై తెలుగు ఇండియన్ ఐడల్ రియాల్టీ షోలో జడ్జిగా కూడా చేసింది. ఇదిలా ఉంటే కొంతమంది హీరోయిన్స్ తమకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ లను అతి జాగ్రత్త కారణంగా మిస్ చేసుకుంటూ ఉంటారు.

అలాంటి గోల్డెన్ ఛాన్స్ ని తన అతి జాగ్రత్త వల్ల ఈ క్రేజీ హీరోయిన్ నిత్యమీనన్ కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ మహానటి సినిమా అందరికీ తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో నటించి మేకర్స్ తో పాటు ప్రేక్షకుల్ని కూడా తన నటనతో ఆకట్టుకుంది. ముందుగా మహానటి సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ను వద్దనుకున్న వారు తన నటనను వెండితెరపై చూసి ఆశ్చర్యపోయారు.

కీర్తి సురేష్ తప్ప, ఆ పాత్రను ఎవ్వరూ చేయలేరునట్టుగా.ఆ పాత్రకు ప్రాణం పోశారు. కీర్తి సురేష్ కనబరిచిన అద్భుత అభినయానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ నటి గా అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో కీర్తి సురేష్ అవార్డులు రివార్డులు అందుకొని దేశవ్యాప్తంగా పాపులర్ అయింది.

దర్శకుడు నాగ్ అశ్విన్ ముందుగా.. ఈ పాత్ర ను మలయాళ క్రేజీ హీరోయిన్ నిత్యామీనన్ కోసం అనుకున్నారట. అయితే, చివరి నిమిషంలో నిర్మాత అశ్వానిదత్ అభ్యంతరం చెప్పడంతో నిత్యామీనన్ ను తప్పించి కీర్తి సురేష్ ను ఫైనల్ చేసారట. ఇటీవల ఓ మీడియాతో ప్రత్యక్షంగా మాట్లాడిన అశ్వినిధత్ ఈ విషయాన్ని తెలిపారు. అయితే, ఈ కథ గురించి తెలుసుకున్న నిత్యామీనన్ ఇందులో మద్యం సేవించే సన్నివేశాలు ఉన్నాయా అని అడిగిందట.

అలాంటి దృశ్యాలు ఉంటే ఈ సినిమా చేయనని కొంతమంది ఫిలిం మేకర్స్ తో కూడా చెప్పిందట. ఆ విషయం నిర్మాత సి. అశ్వనిదత్ చెవిన పడడంతో తను ఈ ప్రాజెక్టుకి వద్దంటే వద్దని, స్క్రిప్ట్ లో మార్పులు డిమాండ్ చేస్తుందని, అలాంటి నటి సావిత్రి పాత్రకు అసలే వద్దని చెప్పారట. ఈ సువర్ణ అవకాశాన్ని నిత్యామీనన్ కోల్పోవడం దురదృష్టకరం అని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -