Heroines: లావుగా ఉన్న కూడా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా?

Heroines: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా వెలగాలి అంటే చాలామంది హీరోయిన్లు సన్నగా మెరుపుతీగల్లా ఉండాలని చూస్తూ ఉంటారు. ఇక కొంతమంది ప్రేక్షకులు కూడా హీరోయిన్లు సన్నగా ఉంటేనే ఇష్టపడతారు. ఇక డైరెక్టర్లు కూడా సన్నగా నాజూగ్గా ఉన్న హీరోయిన్ల ను సినిమాలోకి తీసుకుంటారు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బొద్దుగానే ఉంటూ స్టార్ హీరోయిన్ల స్థాయిలో దూసుకుపోతున్నారు. ఇప్పుడు మనం ఆ హీరోయిన్ల వివరాలు మనం తెలుసుకుందాం. లావుగానే ఉండి ఈ హీరోయిన్లు సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.

ముందుగా నిత్యామీనన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ అమ్మడు ముందు నుంచి బొద్దుగానే కనిపిస్తుంది. ఇటీవల విడుదలైన ధనుష్ తిరు సినిమాలో కూడా నిత్యా బరువు లావుగానే కనిపించింది. ఇక ఈ అమ్మడు లావుగా ఉంటూ కూడా టాలీవుడ్ లో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది.

ఇక తెలుగు అమ్మాయి అంజలి గురించి మనందరికీ తెలిసిందే. అంజలి కూడా మొదటి నుంచి బొద్దుగా ఉంటూనే ప్రేక్షకులకు తన అందాలను వడ్డిస్తూ.. ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అంజలి ఆ మధ్యన కొంచెం వెయిట్ తగ్గినప్పటికీ.. ప్రస్తుతం మునిపటి వెయిట్ ను తన సొంతం చేసుకుంది. ఇలా అంజలి లావుగానే ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక అందాల భామ అనుష్క గురించి మనందరికీ తెలిసిందే. కెరియర్ మొదట్లో కాస్త సన్నగా కనిపించిన ఈ అమ్మడు. ఆ తర్వాత నుంచి కాస్త లావుగా అవ్వడం మొదలు పెట్టింది. ఇటువంటి చబ్బి నెస్ తోనే అనుష్క టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది.

ఇక టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల తార నిధి అగర్వాల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సవ్యసాచి సినిమాలో కాస్త సన్నగా కనిపించిన ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ అమ్మడిని గుర్తుపట్టలేని విధంగా ఉంది. చాలా బొద్దుగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అదేవిధంగా కీర్తి సురేష్ కూడా కొంతకాలం వరకు సన్నగానే ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ ముద్దుగుమ్మ ఎంతో బొద్దుగా ఉంటూ సినీ అవకాశాలను తన సొంతం చేసుకుంటుంది.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -