Prabhakar: కూతురి కోసం జైలుకి వెళ్ళిన ప్రభాకర్‌.. ఏం జరిగిందో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Prabhakar: తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు ప్రభాకర్. ఇప్పటికీ వరుసగా సీరియల్స్ లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఈటీవీ,మాటీవీ, జీ తెలుగు ఇలా అన్నీ చానల్స్ లో సీరియల్స్ లో నటిస్తున్నారు ప్రభాకర్. అప్పుడెప్పుడో మొదలైన ఋతురాగాలు సీరియల్ నుంచి ఇప్పటివరకు దాదాపు పదుల సంఖ్యలో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా చూసిన మీడియాలో ప్రభాకర్ కి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. ఇప్పటికే టైటిల్ ని చూసి షాక్ అయ్యి ఉంటారు. అయితే అది నిజం కాదండోయ్. అదంతా సీరియల్ లో ఒక భాగమే. అసలేం జరిగిందంటే.. నటుడు ప్రభాకర్ ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుందా మురారి సీరియల్ నటిస్తున్నాడు. అందులో హీరో మురారికి మామ క్యారెక్టర్ లో హీరోయిన్ కృష్ణకి బాబాయ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. సీరియల్లో కృష్ణ మురారిలకు యాక్సిడెంట్ అవుతుంది. ఆ ప్రమాదం నుంచి ఇద్దరు బతికి బయటపడగా మురారి కి గతం గుర్తుకు ఉండదు.

ఆ విషయాన్ని కృష్ణ మురారి కుటుంబ సభ్యుల దగ్గర దాచిపెడుతుంది. ఇంతలోనే మురారి కుటుంబ సభ్యులు వచ్చి కృష్ణను కొట్టి కృష్ణనే అదంతా చేసింది. యాక్సిడెంట్ చేయించింది కృష్ణ నే అని అపార్థం చేసుకుంటారు.. వెంటనే పోలీసులను పిలిచి అరెస్టు చేయించగా అప్పుడు కృష్ణ వాళ్ళ బాబాయ్ వచ్చి ఆ తప్పు చేసింది నేనే అంటూ పోలీసులకు లొంగిపోతాడు. ఆ విధంగా కూతురి కోసం జైలుకు వెళ్తాడు ప్రభాకర్. ఇదంతా కూడా సీరియల్ కోసమే. రియల్ లైఫ్ లో జరిగినది కాదు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -