Actress Namitha: తొలిసారిగా బిడ్డతో కలిసి ఫోటో షేర్ చేసుకున్న నమిత.. నిరుత్సాహంలో ఫ్యాన్స్!

Actress Namitha: టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల తార నమిత గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. 2022లో సొంతం సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత వచ్చిన జెమిని సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. అనంతరం పలు స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది.

బిల్లా, సింహ సినిమాల్లో నటించిన నమిత తన హాట్ అందంతో అప్పటి కుర్ర కారుని ఉర్రూతలు ఊగించింది. ఆ తర్వాత పరమవీరచక్ర, శుక్ర వంటి సినిమాల్లో నటించినప్పటికీ.. ప్రేక్షకులను అంతగా మెప్పించ లేకపోయింది. చివరిగా మన్యంపులి సినిమాతో ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది.

కానీ ఆ సినిమా తర్వాత నమిత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. ఏదేమైనా నమిత టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలతో సోషల్ మీడియా ప్రియులను ఆకట్టుకుంటుంది.

కొంతకాలం క్రితం తను గర్భిణి అయిన సంగతి మనకు తెలిసిందే. దీనికి సంబంధించిన మోడ్రన్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. ఇదిలా ఉంటే తాజాగా నమిత తనకు పుట్టిన బేబీ తో సోషల్ మీడియాలోకి అడుగు పెట్టింది. ఆ ఫోటోలో నమిత తన చంటి బిడ్డను పట్టుకొని ఉంది. పక్కన తన బిడ్డకు కావాల్సిన బట్టలు.. కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి.

నమిత తన బిడ్డ ముఖం కనబడకుండా.. ఒక లవ్ ఎమోజి తో కవర్ చేసి పేస్ ను హైడ్ చేసింది. దీంతో తన అభిమానులు కాస్త నిరుత్సాహం చెందారు. ఇక నమిత ‘ఐ మేబి ఎ మెస్.. బట్ ఐయామ్ గుడ్ మామ్’ అంటూ.. క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం నమిత కు సంబంధించిన ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మీరు కూడా ఆ ఫోటో వైపు ఒక లుక్కేయండి.

Related Articles

ట్రేండింగ్

YSRCP: తొలి విడత డబ్బు పంపిణీ దిశగా వైసీపీ అడుగులు.. కోట్లు చేతులు మారుతున్నాయా?

YSRCP: సాధారణంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ప్రచార కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలకు మందు, భోజనంతో పాటు రోజువారీ కూలీ కూడా డబ్బులను కూడా అందజేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే కూటమి చేతిలో...
- Advertisement -
- Advertisement -