Actress Namitha: అందాల భామ నమిత నిజంగానే ఆ స్టార్ డైరెక్టర్ ను కొట్టించిందా?

Actress Namitha: టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల భామ నమిత గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సొంతం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా స్టోరీ పరంగా అంతగా మెప్పించలేకపోయింది. కానీ ఈ అమ్ముడు మాత్రం హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన జెమిని సినిమాలో నటించింది.

ఇక ఇదే క్రమంలో నమిత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమాలో ఒక పాత్రలో తన హాట్ నెస్ తో కుర్రకారుని బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత సింహ సినిమాలో బాలయ్య సరసన నటించింది. ఇక ఇలా టాలీవుడ్ లో పలు స్టార్ హీరోలా సరసన నటించినప్పటికీ ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. నిజానికి నమిత చాలా బొద్దుగా కనిపిస్తుంది. మరి ఇలాంటి ఫిజిక్ అందరి యువ హీరోలకు సెట్ అయ్యేది కాదు.

ఇక కమర్షియల్ సినిమాలకు అసలే సెట్ కాదు. కాగా నమిత సినీ ఇండస్ట్రీలో అంతగా రాణించలేకపోయింది. ఇక ఆ తర్వాత నమిత సినిమా ఇండస్ట్రీలో కనిపించకపోవడానికి ఓ కారణం కూడా అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త బాగా స్ప్రెడ్ అయ్యింది. నమిత ను ఒక దర్శకుడు ప్రైవేట్ గా కలవమని చెప్పాడట. షూటింగ్ లో భాగంగా ఊటీ కి వెళ్ళినప్పుడు నమితకు ఈ పరిస్థితి ఎదురైందని అనుకున్నారు. దీన్ని నమిత ఏమాత్రం తీసుకోలేక తన సన్నిహితులను పిలిచి వారితో ఆ దర్శకుడికి వార్నింగ్ ఇప్పించిందని అప్పట్లో వార్తలు జోరుగా సాగాయి.

అంతేకాకుండా నమిత ఆ దర్శకుడుని కొట్టించిందని అప్పట్లో మీడియా మొత్తం కోడై కూసింది. మరి ఈ విషయంలో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ. వార్తలు మాత్రం ఒక రేంజ్ లో ప్రచారం జరిగాయి. ఈ విషయంలో నిజం ఏమాత్రం లేదని అప్పుడే నమిత సన్నిహితులు కొట్టి పారెశారు. ఇక నమిత సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇటీవల ఇద్దరు కవల పిల్లలకు కూడా నమిత జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -