Actress Sadha: అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటా.. ఆ విషయాలను బయటపెట్టిన సదా!

Actress Sadha: టాలీవుడ్ హీరోయిన్ సదా తెలుగువారందరికీ పరిచయమే. జయం సినిమాతో హీరోయిన్ గా పాపులర్ అయిన ఆమె.. టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో కూడా ఈ అమ్మడు నటించింది. ఢీ డ్యాన్స్ షోలో జడ్జిగా వ్యవహరించిన ఆమె.. వెళ్లవయ్యా వెళ్లు అనే సిగ్నేచర్ డైలాగ్ తో మరింత పాపులర్ అయింది. తన అందంతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. అయితే ఒకప్పుడు ఓవెలుగు వెలిగిన ఆమెకు ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో బుల్లితెరపై అడుగుపెట్టి పలు షోలకు జడ్జిగా పనిచేసింది.

అయితే తాజాగా వెబ్ సిరీస్ లోకి సదా అడుగుపెట్టింది. ఇటీవల హోల్డ్ వరల్డ్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సందర్భంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, పెళ్లి గురించి సదా ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. తనకు ఎలాంటి భర్త కావాలో కూడా ఓపెన్ కూడా చెప్పింది.

తాను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి ధనవంతుడు కావాల్సిన అవసరం లేదని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. వెజిటేరియన్ అయి ఉండాలని, ఒకరిపై ఆధారపడకుండా ఉండాలని సదా తెలిపింది. తన సంపాదనపైనే, మరొకరి సంపాదనపైనే ఆధార పడాల్సిన అవసరం లేదని సదా చెప్పుకొచ్చింది. ఒక వ్యక్తిపై ఆధారపడి పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేరని, నీ సంతోషం కోసం మరో వ్యక్తిపై ఒత్తిడి తీసుకురాకూడదని అంటోంది. నిన్ను సంతోషంగా ఉండాలని వేరే వ్యక్తిపై ఒత్తిడి తీసుకురాకూడదని, దాని వల్ల నీ ఒత్తిడిని కూడా అతడే భరించాలని చెప్పింది.

ఎవరో నన్ను సంతోషంగా ఉంచాలని ఎందుకు అనుకోవాలని, ఎదుటి వ్యక్తిపై కావాలని ఒత్తిడి తీసుకొస్తారని సదా చెప్పుకొచ్చింది. తాను పార్టీలకు, పబ్స్, నైట్ కల్చర్ కు దూరమని సదా తెలిపింది. ఆల్కహల్ తాగనని, నైట్ ఐట్ చేయనని సదా తన వ్యక్తిగత వివరాలు బయటపెట్టింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -