Sadha: ప్రేమ పేరుతో సదాను వాడుకున్న హీరో ఎవరో తెలుసా?

Sadha: ఒకప్పటి హీరోయిన్ సదా గురించి అందరికీ తెలిసిందే. కొన్నాళ్లపాటు తన సినిమాలతో కుర్రకారును పిచ్చెక్కించింది సదా. లవ్ స్టోరీలకు సంబంధించిన మూవీస్ సెలెక్ట్ చేసుకొని తన నటనతో అందరినీ మెప్పించింది. ఆమె నటించిన మొదటి చిత్రం జయం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో ఆమె క్రేజ్ బాగా పెరిగింది.

 

మొదటి సినిమానే హిట్ కొడితే ఆ హీరోయిన్ కు అవకాశాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. సదాకు కూడా అదే జరిగింది. బోలెడు అవకాశాలు వచ్చి పడ్డాయి. ఒక్కసారిగా బిజీగా మారిపోయింది సదా జీవితం. తర్వాత విక్రమ్ సరసన నటించిన అపరిచితుడు మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇక సదా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంతలా కెరీర్ లో దూసుకెళ్లింది.

 

దాదాపు దశాబ్దం పైగా చిత్రసీమలో తిరుగులేని హీరోయిన్ గా వెలిగిపోయింది సదా. అయితే, తర్వాత వయసు పెరుగుతున్న కొద్దీ ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయి. ఇటీవలి కాలంలో అసలు సినిమాల్లో కనిపించడం మానేసింది. 2018 తర్వాత సినిమాల్లో కనిపించలేదు. ఇక ఈ మధ్య కాలంలో టీవీ షోల్లో అప్పుడప్పుడూ కనిపిస్తోంది. ఈటీవీ నిర్వహించే ఢీ షోలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ కనిపిస్తోంది.

 

తాజాగా వెబ్ సిరీస్ లో..
సినిమాల్లో కనిపించడం తగ్గించిన సదా.. ప్రస్తుతం హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇప్పుడు ఆమె వయసు 38 ఏళ్లకు చేరుకుంది. అయితే, ఇంత వరకు పెళ్లి ఊసు ఎత్తడం లేదు సదా. ఇందుకు అనేక కారణాలున్నాయని టాక్ వినిపిస్తోంది. సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపిన సదా.. తర్వాత ఆ హీరో మొహం చాటేయడంతో మోసపోయిందని తెలుస్తోంది. పెళ్లి చేసుకోమని అడిగితే ఆ హీరో నో చెప్పాడట. అతన్ని మర్చిపోలేక ఒంటరిగా మిగిలిపోయిందని టాక్.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -