Vikram-Sadha: హీరో విక్రమ్, హీరోయిన్ సదా మధ్య ఏకంగా అలాంటి రిలేషన్ ఉందా?

Vikram-Sadha: ఛాలెంజింగ్ పాత్రలు చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు తమిళ హీరో విక్రమ్. ఆయన ఇప్పటికే అనేక పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న హీరోగా విక్రమ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే తాజాగా ఈ హీరో గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ రిలేషన్ బయటకు వచ్చింది.

టాలీవుడ్ లో శివ పుత్రుడు సినిమా ద్వారా మొట్టమొదటి సూపర్ హిట్ ని అందుకున్నాడు విక్రమ్. ఆ తర్వాత కొన్నాళ్ళకు అపరిచితుడు మూవీతో ఏ రేంజ్ సెన్సేషన్ ని సృష్టించాడో మనం ప్రత్యేకించి చర్చించనక్కర్లేదు.
విక్రమ్ కి తమిళంతోపాటు తెలుగులోనూ మంచి పేరు ఉంది. మార్కెట్ పరంగా కూడా వసూళ్లు రాబడుతారు.
అప్పట్లోనే అపరిచితుడు చిత్రం సుమారుగా 50 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. ఇందులో విక్రమ్ సరసన సదా యాక్ట్ చేసింది.

 

ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ చూడడానికి ఎంతో చక్కగా అనిపించింది.అయితే కెమెరా ఆన్ లో లేనప్పుడు వీళ్లిద్దరు అన్నా చెల్లి అని పిలుచుకునేవారట. డైరెక్టర్ శంకర్ ఇది గమనించి మీరిద్దరూ నా సినిమాలో హీరో హీరోయిన్లు, అన్నాచెల్లెళ్లు కాదు, మీరు ఆ ఉద్దేశ్యం తో ఉంటే నాకు ఆన్ స్క్రీన్ మీద మీ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ దెబ్బ తినే పరిస్థితి ఉంది. దయచేసి అలా ఉండొద్దు అని ఇద్దరికీ చెప్పాడట. శంకర్ పదేపదే చెప్పినా వీళ్ళు సెట్స్ లో అన్నాచెల్లెళ్లు లాగానే ప్రవర్తించడం తో డైరెక్టర్ శంకర్ అసహనం కి గురై వీళ్ళ మీద కోపగించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -