Actress Sudha: సావిత్రి లాగా నేను కూడా మోసపోయాను.. సీనియర్ నటి సుధ షాకింగ్ కామెంట్స్!

Actress Sudha: సుధ తెలుగు చలనచిత్ర నటి గా అందరికీ సుపరిచితమే. దాదాపు 500 పైనే సినిమాలలో నటించింది. ఈ తరం హీరోలలో దాదాపుగా అందరికీ తల్లి పాత్రలు పోషించింది. మొదట ఈమె తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా చేసిన మొదటి మూడు చిత్రాలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి.

దర్శకుడు బాలచందర్ సలహా మేరకు హీరోయిన్ చెల్లెలి పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయమై సహాయ పాత్రలలో చేస్తూ రాణిస్తుంది. తల్లితండ్రులు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. అల్లు రామలింగయ్య సలహా మేరకు తెలుగు బాగా నేర్చుకొని తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునేది.

ఇలా తన నటనతో సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధ ఇంటర్వ్యూలో పంచుకున్న సంచలన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన తండ్రికి క్యాన్సర్ రావడంతో తాను సినిమాలలో నటించాల్సి వచ్చింది అని పేర్కొంది.

తన తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడు.. దగ్గర ఉండి చూసుకుంటున్న సమయంలో కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. ఇలాంటివి అందరి ఇళ్లల్లో మామూలుగా జరిగేవే. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తాను ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న వారే తనకు అన్నదమ్ములు, బంధువులు అని పేర్కొనడం జరిగింది.

ఇక తాను షూటింగ్లలో ఉదయం నుండి రాత్రి వరకు బిజీగా ఉండడంతో.. ఇంటి పనులు.. ఏవైనా బ్యాంకు పనులు చూసుకునే తీరిక తనకు ఉండకపోవడంతో వేరే వాళ్లపై ఆధారపడవలసి వచ్చింది అని తెలిపింది. అందుకే సావిత్రి గారిలాగా తాను కూడా పక్కవారిని నమ్మి మోసపోయాను అని తెలిపింది.

ఏదైనా కష్టపడి సంపాదిస్తేనే నిలుస్తుంది. ఇతరులను అన్యాయంగా మోసం చేయడం వల్ల ఎక్కువ రోజులు నిలవదు. తన తల్లి ఎప్పుడు ఎంత ప్రాప్తం ఉంటే అంతే దక్కుతుంది అని చెబుతూ ఉండేదట. కాబట్టి నేను అవన్నీ మర్చిపోయి దానం చేశాను అని అనుకుంటాను. ప్రస్తుతానికైతే చాలా సంతోషంగా ఉన్నానని, ఇండస్ట్రీలో చంద్రమోహన్, బెంగుళూరు పద్మ మంచి సన్నీతులు అని పేర్కొనడం జరిగింది.

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -