Actress Sudha: ఎమోషనల్ అయిన నటి సుధ.. ఏం జరిగిందంటే?

Actress Sudha: సీనియర్‌ నటి సుధ చాలా చిత్రాల్లో హీరోయిన్‌ తల్లి క్యారెక్టర్లతో ఫేమస్‌ అయ్యింది. పలువురు హీరోలకు కూడా తల్లిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి.. ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఆమె తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ క్రమంలో అనేక మంది అభిమానులను కూడా సంపాదించుకుంది సుధ. ముఖ్యంగా ఆమె నటించిన పోకిరి మూవీలో ఇలియానా తల్లి క్యారెక్టర్‌కు మంచి గుర్తింపు లభించింది.

 

అయితే మొదట్లో ఆమె హీరోయిన్‌గా కూడా చేసిందనే విషయం చాలా మందికి తెలియదు. అదరికీ అమ్మ, అత్త పాత్రల్లో నటించినట్లుగానే గుర్తుండిపోయింది సుధ. హీనోయిన్‌గా చేసిన మూవీల్లో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది సుధ. ఆ క్రమంలోనే ఆమె క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయింది. కెరీర్‌లో ఆమెకు బాలచందర్‌ గురువుగా ఉన్నాడు.

 

బాలచందర్‌ సూచన మేరకే ఆమె క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సెటిల్‌ అయ్యిందని చెబుతారు. తల్లి పాత్రలు అంటే టక్కున గుర్తొచ్చేలా ఆమె నటన ఉంటుంది. ఎన్ని గుర్తింపు వచ్చే పాత్రలు చేసినా ఆమె కెరీర్‌ పరంగా కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొందట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆమె కష్టాలు వింటే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి.

 

ఆ బిజినెస్‌ వల్ల నష్టపోయాను..
సుధకు చిన్నప్పుడే తల్లి దూరం అయ్యింది. పెద్దయ్యాక తండ్రి దూరమయ్యాడు. నలుగురు అన్నదమ్ములు కూడా తనను పట్టించుకోలేదని సుధ కన్నీటి పర్యంతమైంది. చాలా కష్టాలు పడి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్లు తెలిపింది సుధ. ఢిల్లీలో హోటల్‌ బిజినెస్‌ చేయడం వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయినట్లు సుధ తెలిపింది. తర్వాత సినిమాల్లో నటించి చాలా సంపాదించినట్లు చెప్పింది. అయితే, కొందరిని నమ్మడం వల్ల నిండి మునిగిపోయానని కన్నీటి పర్యంతమైంది సుధ. అప్పటి నుంచి ఎవరినీ నమ్మడం లేదని, డబ్బు కోసం ఆలోచన చేయడం మానేశానని తెలిపింది. మనసుకు ఏది నచ్చితే అదే చేస్తున్నానని తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -