Aishwarya Arjun: పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఐశ్వర్య అర్జున్.. వరుడు కూడా నటుడే?

Aishwarya Arjun: తెలుగు సినీ ప్రేక్షకులకు యాక్షన్ కింగ్ అర్జున్‌ సార్జా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తన కంటుకు ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు అర్జున్‌ సార్జా. కేవలం హీరో గానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 40 ఏళ్ల తన సినీ ప్రస్తానంలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఆయన సినిమాలు చేశారు. తెలుగులో దాదాపు 40 కి పైగా సినిమాలలో నటించి మెప్పించారు అర్జున్. ఇక సినిమాలపై ఉన్న ఫ్యాషన్ తో తన కూతురు ఐశ్వర్య అర్జున్ ని కూడా సినిమాలలోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

 

2013లో వచ్చిన పట్టతు యానయ్‌ అనే తమిళ సినిమాతో ఐశ్వర్య సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేమ బరాహా అనే కన్నడ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అర్జున్ దర్శకత్వంలోనే ఒక సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఐశ్వర్యకు సంబంధించి ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే త్వరలోనే ఐశ్వర్య అర్జున్ పెళ్లి పీటలు ఎక్కనుందట. అయితే ఐశ్వర్య పెళ్లి చేసుకోబోతున్న వరుడు కూడా ఒక నటుడే. కాగా వరుడు మరెవరో కాదు తమిళనాట మంచి పేరున్న హాస్యనటుడి కుమారుడే.

ఐశ్వర్య తమిళ సీనియర్‌ హాస్య నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో గత కొంత కాలంగా రిలేషన్‌లో ఉన్నారట. పెళ్లి గురించి ఈ ఇద్దరు తమ ఇంట్లో వారితో చర్చించారట. వీరి పెళ్లికి రెండు కుటుంబాలు ఓకే చెప్పారట. త్వరలో వీరి పెళ్లి అత్యంత ఘనంగా జరగబోతోందని తెలుస్తోంది. కానీ ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రానుందని తెలుస్తోంది. ఉమాపతి కుటుంబం నుంచి గానీ, అర్జున్‌ కుటుంబం నుంచి గానీ, అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -