Akkineni Nagarjuna: ఆ సమయంలో అచ్చం నాగచైతన్యలా ఉన్న నాగార్జున.. ఏమైందంటే?

Akkineni Nagarjuna: అక్కినేని నవ మన్మధుడిగా ఇప్పటికీ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి హీరోలలో నాగార్జున ఒకరు. ఈయన నవ మన్మధుడుగా ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఆరు పదుల వయసులో కూడా నాగార్జున ఎంతో చలాకీగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇక ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో హీరోలకు వారి త్రో బ్యాక్ ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాగార్జునకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాగార్జున మొదటి సారి పెళ్లి చేసుకున్న సమయంలో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఫోటో చూసిన అభిమానులు నాగార్జున నాగచైతన్య పోలికలతో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున ఈ ఫోటో పై కామెంట్లు చేస్తూ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.ఇక పెళ్లి దుస్తులలో నాగార్జున నాగచైతన్య మాదిరిగానే ఉన్నారు.ఇక ఈయన మొదటిసారిగా దగ్గుబాటి లక్ష్మిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దగ్గుబాటి రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మి నాగార్జున మొదటి వివాహం చేసుకున్నారు.అయితే కొన్ని సంవత్సరాలు పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న లక్ష్మి నాగచైతన్య పుట్టిన తర్వాత నాగార్జునతో కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. ఈ విధంగా లక్ష్మి నాగార్జున విడాకులు తీసుకున్న అనంతరం ఈయన నటి అమలతో ప్రేమలో పడ్డారు.

ఈ విధంగా అమలను ప్రేమించిన నాగార్జున తనతో ఏడడుగులు నడిచారు.ఇక లక్ష్మి చెన్నైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు.ఇక నాగచైతన్య తన బాల్యం మొత్తం తల్లి దగ్గర గడిపిన ప్రస్తుతం తన తండ్రి దగ్గరే ఉంటున్నారు.ఇలా నాగచైతన్య ఒకవైపు అక్కినేని ఫ్యామిలీ మరోవైపు దగ్గుబాటి ఫ్యామిలీ వారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మితో వివాహం చేసుకున్న సమయంలో నాగార్జునకు సంబంధించిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts