IVF: పిల్లలు లేని దంపతులకు అలర్ట్.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

IVF: ప్రస్తుతం కాలంలో ఎంతోమంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. అందువల్ల ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) పద్ధతి ద్వారా పిల్లలను కనటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ సహజ పద్దతిలో పిల్లలు పుట్టకపోతే.. ఐవిఎఫ్ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. వివాహం జరిగి సంవత్సరాలు గడుస్తున్న కూడా సంతానం లేక బాధపడుతున్న దంపతుల ఆసక్తి మేరకు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) పద్దతిని డాక్టర్లు సిఫార్సు చేస్తారు.

అయితే ఈ ఐవీఎఫ్ విధానంలో 45 నుంచి 50 శాతం వరకు సక్సెస్ రేట్ ఉంది. అయితే ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కలిగినప్పటికీ ఈ పద్ధతి ద్వారా తల్లి అయినటువంటి వారిలో కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు అయితే ఇది అందరిలో ఉండదని కేవలం 1% మహిళలకు మాత్రమే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు.మరి ఐవిఎఫ్ చేయించుకోవడం ద్వారా ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి అనే విషయాన్ని వస్తే..

 

కొంతమంది మహిళలకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సంతానోత్పత్తి మందుల కారణంగా మహిళలో మానసిక ఒత్తిడి, తలనొప్పి, పొత్తికడుపు నొప్పి, వేడి ఆవిర్లు, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతే కాకుండా మరీ కొన్ని సందర్భాల్లో అండాశయ హైపర్-స్టిమ్యులేషన్ సిండ్రోమ్ (OHSS) వచ్చే అవకాశం ఉంది.దీని ద్వారా మహిళల ఆండాశయాలు ఉబ్బి శరీరంలోకి ద్రవాన్ని లీక్ చేసే ప్రమాదం ఉంటుంది.

 

అందువల్ల సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని కనటానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు సహజ పద్ధతి ద్వారా పిల్లల కోసం ప్రయత్నించటం ఉత్తమం. అయితే ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి కారణంగా ప్రతి ఒక్కరు సంపాదన వ్యామోహంలో పడుతున్నారు.అలాగే మారిన జీవనశైలి ఆధారంగా చాలామందిలో సంతానలేమి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి ఇలా సంతానలేమి సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఐ వి ఎఫ్ కు మొగ్గు చూపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -