Pregnancy: ప్రెగ్నెన్సీ మహిళలు బెండకాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Pregnancy: స్త్రీకి తల్లి అవ్వడం అన్నది దేవుడు ఇచ్చిన గొప్ప వరం. కానీ ప్రస్తుత రోజుల్లో చాలామంది సంతానం కలగక ఇబ్బందులు పడుతూ హాస్పిటల్స్ గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. మహిళలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు స్త్రీలు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ప్రతి ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలని చెబుతూ ఉంటారు. ఆహారం విషయంలో తాగే పానీయాల విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని చెబుతూ ఉంటారు. కడుపుతో ఉన్న స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలి కడుపులో ఉండే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఇకపోతే మన వంటింట్లో దొరికే కూరగాయల్లో బెండకాయ ఒకటి.

బెండకాయలో మంచి మొత్తంలో ప్రొటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్ ఉంటాయి. విటమిన్ సి, బి3, బి9 వంటి విటమిన్లు, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటివి ఇందులో పుష్కలంగా లభిస్తాయి. చాలామంది ఈ పెగ్నెన్సీగా ఉన్నప్పుడు బెండకాయను తినవచ్చా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. బెండకాయ తినవచ్చా? లేదా? తింటే ఎటువంటి సమస్యలు ఏమైనా వస్తాయి.. అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రెగ్నెన్సీతో ఉన్నవారు బెండకాయ తినడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. బెండకాయ బ్లడ్‌లో షుగర్ లెవల్‌ని నియంత్రిస్తుంది, పుట్టుకతో వచ్చే వైకల్యాల నుండి శిశువును కూడా రక్షిస్తుంది. బెండకాయ ఫైబర్‌తో నిండి ఉంది. ఇది అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.

కరిగే ఫైబర్ కారణంగా పోషకాలు శరీరంలో బాగా శోషించబడతాయి. దాంతో తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. కరిగే ఫైబర్ తీసుకోవడం రక్త కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది, మధుమేహం చికిత్సలో కూడా సహాయపడుతుంది. బెండకాయ ఫోలేట్‌కి మంచి మూలం. ఈ ఫోలేట్ డిఎన్ఏ, ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. బెండకాయ విటమిన్ల గని అని చెప్పవచ్చు. బెండకాయలో విటమిన్ ఎ, బి, సి, ఈ ఉన్నాయి. విటమిన్ సి, ఐరన్‌ను గ్రహించడం ద్వారా పిల్లల పెరుగుదలకు సహాయపడుతుంది. విటమిన్ ఈ అనేది తల్లికి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది, అలాగే పిల్లల ఎముకలు, కండరాలను బలపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బెండకాయ తల్లి,బిడ్డ ఇద్దరిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడం అంటే వ్యాధులు, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడం. కాబట్టి ఈ బెండకాయ తినడం వల్ల గర్భిణీ స్త్రీలకు ఎటువంటి సమస్యలు ఉండవు. అలా అని మితిమీరి తీసుకోకుండా తగినంత తీసుకోవడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -