Ali Shehyaz: అలీ అల్లుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే?

Ali Shehyaz: టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ ఇటీవల తన పెద్ద కూతురు ఫాతిమాకు ఘనంగా వివాహం చేశారు. తాజాగా గుంటూరులో పెళ్లి రిసెప్షన్ కూడా జరిగింది. రిసెప్షన్ ఈవెంట్‌కు ఏపీ సీఎం జగన్, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులకు ఆశీర్వదించారు. కాగా, ఫాతిమా-షెహయాజ్ మ్యారేజ్ హైదరాబాద్‌లోని అన్వయ కన్వెక్షన్‌లో గ్రాండ్‌గా జరిగింది. అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరిగాయి. టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల, బిజినెస్‌మెన్‌లు పెళ్లి వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి వేడుకలకు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి, సెలబ్రిటీలు చిరంజీవి, నాగార్జున, అమల తదితరులు హాజరయ్యారు.

 

 

నిజానికి సెలబ్రిటీల పెళ్లిళ్లలంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సెలబ్రిటీ పెళ్లిళ్లు ఎలా జరిగాయి? వరుడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ? ఎంత సంపాదిస్తాడు? ఎంత కట్నం తీసుకున్నాడు? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి. వధువు, వరుడికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి నెటిజన్లు ఇంతో ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ క్రమంలో అలీ అల్లుడు ఎవరనే విషయంపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే అలీ పెద్ద కూతురు ఫాతిమా ఎంబీబీఎస్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. అలీ అల్లుడు షెహయాజ్ కూడా డాక్టరే. అలీ కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్‌గా ఫాతిమా నిలిచింది. కాగా, జలానీ భాయ్, జమీలా బాబీ దంపతుల కుమారుడు షెహయాజ్. ఇతనికి ఓ అన్న, సోదరి కూడా ఉన్నాడు. వీళ్లిదర్దరితోపాటు షెహయాజ్ వదిన కూడా డాక్టరే. వీరందరూ గుంటూరుకు చెందిన వారు. ప్రస్తుతం వీరు లండన్‌లో సెటిల్ అయ్యారు.

 

 

అయితే అలీ కూతురు డాక్టర్ చదివించాలని.. అల్లుడు కూడా డాక్టరే ఉండాలని అలీ భావించారట. అందుకే షెహయాజ్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. కాగా, ప్రస్తుతం అలీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా కొనసాగుతున్నాడు. ‘అలీతో సరదాగా’ అనే షోకి హోస్ట్‌ గా కూడా వ్యవహరిస్తున్నారు. సినిమాలు, షోలు చేస్తూ.. ఫుల్ బిజీగా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. అలాగే నిర్మాతగా కూడా తన మార్క్‌ ను సెట్ చేసుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -