Comedian Ali: అలీని నమ్మించి మోసం చేసిన జగన్.. ఎన్నిసార్లు మోసపోయినా అలీకి బుద్ధి రాదా అంటూ?

Comedian Ali: అలీ లేకుండా పవన్ సినిమా ఉండదు. ఏదైనా డైరక్టర్ స్టోరీ చెప్పడానికి వస్తే.. అందులో అలీ క్యారెక్టర్ ఏంటీ అని పవన్ అడుగుతారని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. అలాంటి పవన్, అలీ రాజకీయంగా విభిన్న దృవాల్లో ఉన్నారు. అంతేకాదు.. పవన్ తన అన్న పేరు వాడుకొని సినిమాలకు వచ్చాడు. కానీ.. తాను స్వశక్తితో సినిమాల్లో ఈ స్థాయికి వచ్చానని అలీ ఓసారి అన్నారు. అప్పట్లో అది ఓ సంచలనంగా మారింది. ఇదంత ఎవరి కోసం అంటే జగన్ కోసం. అలీ వైసీపీలో చేరిన తర్వాత జనసేన, టీడీపీపై విమర్శలు చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో.. అలీని కూడా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. దీంతో.. పవన్ పై అలీ విమర్శలు చేశారు. జగన్ కోసం, వైసీపీ కోసం అలీ ఇంత చేస్తే.. జగన్ మాత్రం ఆయనికి వరుస పెట్టి హ్యాండిస్తూ వస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలనేది చిరకాల కోరిక. పైగా ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కనుక.. సినిమాల ద్వారా పాపులారిటీ ఉంది కనుక.. ఆయనకు ఏ పార్టీ నుంచి అయినా టికెట్ దక్కుతుందని చాలా మంది భావించారు. 2014 నుంచి ఆయన టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కానీ రాలేదు.

ఎవరు తనకు టికెట్ ఇచ్చి.. మంత్రి పదవి ఆఫర్ చేస్తారో.. ఆ పార్టీలోకే వెళ్తానని 2019 ఎన్నికల ముందు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అయితే అలాంటి ఆఫర్స్ ఏమీ రాకపోవడంతో .. వైసీపీ గాలిని పసిగట్టి అప్పట్లో ఆ పార్టీలో చేరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం నామినేటడ్ పదవి అయినా వస్తుందని అలీ అనుకున్నారు. కానీ, గౌరవ సలహాదారుడిగా నియమించి చేతులు దులుపుకున్నారు. ఇక చూస్తుండగానే ఐదేళ్లు అయిపోయాయి. ఎన్నికలు వచ్చింది. వైసీపీ 175 స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. కానీ, అందులో అలీ పేరు లేదు. దీంతో.. జగన్ మరోసారి అలీకి మొండి చెయ్యి చూపించారని ఇంటా బయట చర్చ జరుగుతోంది. జగన్ ను నమ్ముకొని అలీ ప్రాణ మిత్రుడు లాంటి పవన్ పై కూడా విమర్శలు చేశారు. అదే జనసేనలో ఉంటే ఆయనకు టికెట్ వచ్చి ఉండేది. పోని ఇప్పుడు ఏదైనా పార్టీ మారినా టికెట్ వస్తుందా? అంటే అలాంటి పరిస్తితి లేదు. మొత్తానికి చట్టసభలకు వెళ్లాలనుకునే అలీ ఆశలపై జగన్ నీళ్లు చల్లారు. తర్వాత 2029 నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.

జగన్ అలీనే కాదు సినిమా వాళ్లందరినీ ఇలాగే వాడుకొని పక్కన పడేస్తున్నారు. మొదట 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్విను ఇలాగే వాడుకున్నారు. ఆయన కూడా పవన్ పై నోటికొచ్చినట్టు మాట్లాడేవారు. వ్యక్తిగత దూషణలకు దిగేవారు. సినిమా రేంజ్ లో చంద్రబాబు, పవన్ ను విమర్శించేవారు. వైసీపీలో ఉండి జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి ఇలా చేసేవారు. అయితే.. జగన్ అసలు గుణం తెలుసుకొని త్వరగానే బయటకు వచ్చి.. జనసేనలో ఆయన చేరారు. ఇక.. పోసాని కృష్ణ మురళీ కూడా చంద్రబాబు, పవన్ పై ఒంటికాలిపై లేస్తారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు పోలవరం ప్రత్యేకహోదా గురించి మాట్లాడిన పోసాని ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు భజన చేస్తున్నారు. విభజన హామీల గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు అలీని వాడుకొని ఇప్పుడు వైసీపీ నట్టేటా ముంచేశారు.

Related Articles

ట్రేండింగ్

Volunteers on YSRCP Manifesto: గ్రామ వాలంటీర్ల మైండ్ బ్లాంక్ చేసిన మేనిఫెస్టో.. నిన్ను నమ్మం జగన్ అంటూ?

Volunteers on YSRCP Manifesto: వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోని చూసి సాధారణ ప్రజలే కాదు ఆయన కోసమే పని చేసిన గ్రామ వాలంటీర్లు కూడా జగన్ అన్యాయం చేశాడని గగ్గోలు పెడుతున్నారు సదరు గ్రామ వాలంటీర్లు. గత...
- Advertisement -
- Advertisement -