Alia: అమ్మ ప్రేమను పంచుతున్న అలియా.. బిడ్డకు పాలిస్తూ?

Alia: ఆర్ఆర్ఆర్ సినిమాలో మెరిసిన హీరోయిన్ ఆలియా భట్ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఆలియా భట్ ఈ మధ్యకాలంలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఆలియా తన కూతురుకు పాలు ఇస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అయిన ఆలియా భట్ హీరో రణబీర్ కపూర్ ను లవ్ చేసి వివాహమాడింది. ఈ కొత్త జంట ఏడాది పేరెంట్స్ అయ్యారు.

పెళ్లైన కొన్నినెలలుకే వీరిద్దరు పేరెంట్స్‌గా ప్రమోషన్ సాధించారు. ఆలియా ఆడబిడ్డకు జన్మనివ్వడంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో ఆలియా భట్ తన భర్తతో కలిసి కనిపించింది. ఈ జంట ఈ ఏడాది ఏప్రెల్‌లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులకే ఆలియా తాను ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసి అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. పండంటి ఆడబిడ్డకు ఆలియా జన్మనివ్వడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.

తాజాగా ఆలియా ఇటీవల తన కూతురు పేరును రివీల్ చేసింది. చిన్నారి డ్రెస్ ఉన్న పోస్టర్ పై రాహా అనే పేరుతో ఉన్న పిక్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. పాపను ఎత్తుకుని ఉన్న ఆలియాకు కొంత దూరంలో రణబీర్ కూడా ఉన్నాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

అయితే తాజాగా అలియా బ్రెస్ట్ ఫీడింగ్ ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఎరుపు రంగు చీరలో బిడ్డకు పాలు ఇస్తూ ఆలియా నవ్వులు చిందిస్తున్నట్లు కనిపించడం అందర్నీ ఆకట్టుకుంది. ఆ ఫోటోల్లో ఆలియా చేతులు, ముఖం కాస్త బొద్దుగా కనిపించాయి. అందం తగ్గిపోతోందని, వయసు కనిపిస్తోంది అని సరోగసి ద్వారా బిడ్డలను కనె సెలబ్రిటీలు ఈ రోజుల్లో ఉన్నారు. అలాంటి ఈ రోజుల్లో కూడా సహజ పద్దతిలో బిడ్డను కనడమే కాకుండా మాతృత్వాన్ని పెంచే తల్లిపాలు ఇస్తున్నందుకు ఆలియాను అందరూ ప్రశంసిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Volunteers: వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే.. వైసీపీకి కొత్త శత్రువులు అవసరమే లేదుగా!

AP Volunteers: శత్రువులు ఎక్కడో ఉండరు.. మన ఇంట్లోనే కూతరు రూపంలోనో.. చెల్లెలు రూపంలో మన చుట్టూనే తిరుగుతారని ఓ సినిమాలో రావు రమేష్ అంటాడు. అక్కడ హీరోయిన్ గురించి చెప్పాల్సి వచ్చింది...
- Advertisement -
- Advertisement -