Celebrities: బరువు తగ్గి అభిమానులను అలరించిన సెలబ్రిటీలు వీళ్లే!

Celebrities: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు నటీనటులు సినిమా సినిమాకి వారి క్యారెక్టర్ కి అనుగుణంగా వారి శరీరాకృతిని మార్చుకుంటూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు సినిమాలలో నటించకపోయినప్పటికీ హీరో హీరోయిన్లు అనుకోకుండా లావుగా మారడం లేదు సన్నగా మారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో చాలామంది సెలబ్రిటీలు బాడీ షేమింగ్ కి గురవుతూ ఉంటారు. అయితే చాలా వరకు నటీనటులు హీరో హీరోయిన్లు బరువు తగ్గి రూపాన్ని పూర్తిగా మార్చేసుకున్నారు. మరి వారిలో కొందరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు లావుగా బొద్దుగా ఉండేవారు. తర్వాత యమదొంగ సినిమా సమయంలో సన్నగా మారి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ఒకప్పటి ఎన్టీఆర్ తో పోల్చుకుంటే ఇద్దరూ ఒకటేనా అన్న అనుమానం కూడా రాకమానదు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఒకప్పుడు పూర్తిగా లావు ఉన్న కరణ్ జోహార్ 4 నెలల్లో 17 కేజీలు తగ్గి ఒక్కసారిగా అభిమానులకు షాకిచ్చాడు. తమిళ హీరో శింబు కూడా ఒకప్పుడు లావుగా బరువుగా ఉండేవారు. కానీ ఆ తర్వాత దాదాపు 15 కేజీలకు పైగా తగ్గి సన్నబడి షాక్ ఇచ్చారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ మొదట్లో చాలా లావుగా బొద్దుగా ఉండేది. కానీ ఆ తర్వాత కష్టపడి దాదాపు ఆరు నెలలు కష్టపడి 20 కేజీల బరువు తగ్గి సన్నగా నాజూగ్గా తయారయింది. అలాగే ఒకప్పటి హీరోయిన్ కుష్బూ దాదాపుగా 20 కేజీల వరకు బరువు తగ్గి ఊహించిన విధంగా షాక్ ఇచ్చింది. హీరో అర్జున్ కపూర్ 50 కేజీలు కి పైగా బరువు తగ్గిపోయారు. అర్జున్ కపూర్ బోనికపూర్ కొడుకు. కేవలం ఈ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలామంది సెలబ్రిటీలు బరువు తగ్గి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -