Allu Arjun: అన్న భార్య పుట్టిన రోజు వేడుకల్లో అల్లు అర్జున్.. వైరల్ ఫొటోస్?

Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత ఏడాది విడుదలైన పుష్ప సినిమాతో ఒక్కసారిగా అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగింది. పుష్ప సినిమా ముందు వరకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని పిలిచే అభిమానులు పుష్ప సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని పిలుస్తున్నారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లేవలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ప్రభాస్ ను మించిపోయాడు అని చెప్పవచ్చు.

ఇకపోతే పుష్ప పార్ట్ 1 తరువాత పార్ట్ 2 సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని టాలీవుడ్ అభిమానుల కంటే బాలీవుడ్ అభిమానులే ఎక్కువగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే పుష్ప 2 కీ సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది. అయితే పుష్ప పార్ట్ 2 ని మరింత భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలి అని ఆలోచనలో ఉన్నారు దర్శకనిర్మాతలు. ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ తన వదిన నీలుషా బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా సందడి సందడి చేశారు.

బర్త్ డే పార్టీ లో బన్నీ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో అల్లు బాబీ తో కలిసి అల్లు అర్జున్ మాట్లాడుతున్న ఫొటోలు, నీలు షా తో కలిసి దిగిన ఫొటోస్ తో పాటు మరిన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -