Anasuya:జబర్దస్త్ గురించి అనసూయ షాకింగ్ కామెంట్స్.. ఏకిపారేస్తున్న నెటిజెన్స్!

Anasuya:బుల్లితెర జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఈ కార్యక్రమంలో ఉన్నన్ని రోజులు హైపర్ ఆది పై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ వచ్చింది. అలాగే హైపర్ ఆది కూడా పెద్ద ఎత్తున తన స్కిట్ లో భాగంగా అనసూయను ఇన్వాల్వ్ చేస్తూ తనపై తన భర్త పై సెటైర్లు వేసిన విషయం మనకు తెలిసిందే.మొత్తానికి ఇలా పరోక్షంగా ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున హిట్ చేశారు.
ఇకపోతే ఈ కార్యక్రమం నుంచి గత కొన్ని రోజులుగా వరుసగా వలసలు మొదలవుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది ఈ కార్యక్రమం నుంచి తప్పుకోగా తాజాగా అనసూయ కూడా ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లారు. ఇకపోతే తాజాగా ఈమె తను జబర్దస్త్ కార్యక్రమాన్ని విడిచి రావడానికి గల కారణాలను తెలియజేశారు. జబర్దస్త్ కార్యక్రమంలో తనపై వేసే సెటైర్లు,బాడీ షేమింగ్ గురించి చేస్తున్న కామెంట్స్ తనకు నచ్చలేదని అందుకే తాను బయటికి వచ్చాను అంటూ వెల్లడించారు.
అయితే క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న తర్వాత ఇలాంటివన్నీ సర్వసాధారణం అనుకున్నాను. కానీ కొన్నిసార్లు వాళ్ళు వేసే డైలాగులు తనని ఎంతో ఇబ్బంది పెట్టాయని అందుకే గత రెండు సంవత్సరాల నుంచి తాను ఈ కార్యక్రమం నుంచి బయటకు రావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నానని ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నానని అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ అనసూయ పై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఉన్నప్పుడు అనసూయ కూడా యధావిధిగా అందరిపై సెటైర్లు వేస్తూ వెకిలి చేష్టలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు తనకు సినిమా అవకాశాలు రావడంతో ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోయి ఈ కార్యక్రమం పై బురద చల్లడం ఏంటి అంటూ పలువురు నెటిజన్లు ఈమెపై సెటైర్లు వేస్తున్నారు.ఈ కార్యక్రమం ద్వారా నీకు అంత ఇబ్బంది కలిగి ఉంటే అప్పుడే బయటకు రావాల్సింది కదా ఇలా ఇప్పుడు ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి ఆ కార్యక్రమం పై ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటి అంటూ నెటిజన్ లు దారుణంగా ఈమెను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -