Hyper Aadi: జనసైనికులకు హితబోధ చేసిన హైపర్ ఆది.. పవన్ కళ్యాణ్ ఏం చేసినా రాష్ట్రం కోసమే అంటూ?

Hyper Aadi:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు అయితే పదేళ్లుగా ఈ పార్టీ ఎన్నికల పోటీలో ఉన్నప్పటికీ ఒక్క సీటు కూడా గెలవకపోవడం అయితే ఈసారి మాత్రం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగబోతుంది. ఈ క్రమంలోనే జనసేనకు 24 ఎమ్మెల్యేలు మూడు ఎంపీ సీట్లను కేటాయించారు ఇలా జనసేనకు 24 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడంతో జనసేన కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ పట్ల విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో హైపర్ ఆది జనసైనికులకు హితబోధ చేస్తూ చేస్తున్నటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక పార్టీని అభిమానించే వాళ్లే ఇంతలా ఆలోచిస్తూ ఉంటే ఇక ఆ పార్టీని ముందుకు నడిపించేవాడు పదేళ్లుగా పార్టీ బాధ్యతలను చూసుకుంటున్నటువంటి వ్యక్తి ఇంకెంత ఆలోచించి ఉంటాడో అర్థం చేసుకోవాలని తెలిపారు.

ఆయన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు మన పార్టీ నేత ఎలాంటి నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కానీ ఇలా నచ్చినపుడు ఒకలాగా నచ్చనప్పుడు మరోలా వ్యవహరించడం అభిమానం అనిపించుకోదని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ ని ధోనితో పోలుస్తూ ఆయన గొప్పతనాన్ని తెలియజేశారు. గతంలో ఒక సీటు కూడా గెలవని పవన్ కళ్యాణ్ ఈసారి 24 సీట్లతో అసెంబ్లీ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలిపారు.

గత పది సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉంటూ పవన్ కళ్యాణ్ తన జేబులో నుంచి డబ్బులను తీసి ప్రజలకు పంచుతున్నారని తెలిపారు. తన పిల్లల కోసం దాచుకున్న డబ్బులను తన పార్టీ కోసం ఖర్చు పెడుతున్నారని హైపర్ ఆది వెల్లడించారు. ఇలా ప్రజల కోసం పరితపించే పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న ఆయన అభిమానులకు కార్యకర్తలుగా ఆయన వెంటే ఉండాలి కానీ ఇలా తనని విమర్శించడం సరైన పని కాదు అంటూ ఈ సందర్భంగా ఆది చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -