AP Liquor: పేద కుటుంబాలతో జగన్ చెలగాటం.. సర్కారు మద్యం తాగితే ప్రాణాలకే ప్రమాదమా?

AP Liquor: గత ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే మధ్యపానాన్ని విడతలవారీగా పూర్తిగా నిషేధిస్తాను అంటూ తన నవరత్నాలలో ఒక రత్నంగా మద్యపాన నిషేధాన్ని చేర్చారు. అయితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి బ్రాండ్లను మొత్తం తీసేసి తన బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ మందులను స్వయంగా జగన్మోహన్ రెడ్డి అనుచరులకు సంబంధించిన కంపెనీలు తయారుచేసి రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తున్నాయి.

ఇలా జే బ్రాండ్ అంటూ వివిధ రకాల కొత్త కంపెనీ మందులు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి దీంతో మందుబాబులు దిక్కుతోచక నాసిరకం ఈ జే బ్రాండ్ మందులు తాగుతూ అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది. పూర్తిగా మందుకు బానిస అయినటువంటి వారు ఒక్కసారిగా మద్యం మానుకోవడం కష్టం అందుకే ఖర్చు ఎక్కువైనా మన రాష్ట్రంలో దొరికే నాసిరకం కల్తీ మధ్యమే తాగుతున్నారు.

ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అమ్మే ఈ నాసిరకం బ్రాండ్లను తాగటం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు మరికొందరు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయాలన్నింటిని ఏపీలో పలు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు స్వయంగా వెల్లడించారు. పలు గ్రామాలలో ఇప్పటికే కల్తీ మద్యం కారణంగా చనిపోగా మరికొందరు కాలేయ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు.

ఇలా నాసి రకం కల్తీ మద్యం తాగటం వల్ల నిద్ర పట్టడం లేదని, కడుపులో మంట రావడం, నోరు మొత్తం ఎండిపోవడం, ప్రక్కటెముకలలో నొప్పి చాతి నొప్పి వంటి సమస్యలు కూడా ఎదురవుతున్నట్లు పలువురు బాధితులు తెలియజేస్తున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం నాసిరకం మందులను అందుబాటులోకి తెచ్చి పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -