AP Grama Volunteer: వాలంటీర్ల అవార్డ్ సొమ్ములు కూడా జమ కాలేదుగా.. బటన్ గట్టిగా నొక్కండి సార్ అంటూ?

AP Grama Volunteer: అంతన్నాడు.. ఇంతన్నాడే గంగరాజు ముంత మామిడి పండన్నాడే గంగరాజు.. ఏపీలో సీఎం జగన్ వ్యవహారం చూస్తుంటే ఈ పాటే గుర్తొస్తుంది. జగన్ మాటలు కోటలు దాటినా చేతలు గడపలు దాటడం లేదు. జగన్ నొక్కతున్న బటన్లు గత రెండేళ్లుగా సరిగా పని చేయడం లేదని సెటైర్లు పడుతున్నాయి. బటన్ నొక్కిన రెండు, మూడు నెలల తర్వాత పని చేస్తున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే.. ఇప్పుడు ఆ సెటైర్లు తీరు మారింది. గతంలో లేటుగా అయినా పని చేసిన బటన్లు ఇప్పుడు పని చేస్తాయా? లేదా? అన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయని అనుకుంటున్నారు. అయితే.. ఈ కామెంట్స్ ఎవరు చేశారో చెబితే.. ఎవరైనా షాక్ తింటారు. జగన్ సైన్యం వాలంటీర్లు అంటున్నారు. ఇటీవల జగన్ వాలంటీర్లకు ప్రోత్సహకాలు ప్రకటించారు. అయితే ఆ డబ్బులు కూడా జగన్ బటన్ నొక్కి వాలంటీర్ల అకౌంట్స్‌లో వేశారు.

జగన్ బటన్ అయితే నొక్కారు కానీ.. డబ్బు మాత్రం అకౌంట్స్‌లోకి రాలేదు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డుల డబ్బులు ఎవరికైనా పడ్డాయా? అని సోషల్ మీడియాలో వాలంటీర్ అడిగాడు. లేదు.. సీఎం నొక్కిన బటన్ పని చేయలేదనుకుంటా.. మరోసారి నొక్కితే మంచిదని మరో వాలంటీర్ బదులిచ్చాడు. అయితే, దాన్ని కొనసాగిస్తూ సీఎం సరిగా నొక్కలేదేమో.. ఈసారైనా మంచిగా నొక్కితే మంచిదని ఇంకో వాలంటీర్ కామెంట్ చేశాడు. ఈ ఏడాది పడేలా లేవు లే బ్రో అంటూ మరొక వాలంటీర్ సెటైర్ వేశాడు. ఇలా.. చివరికి వాలంటీర్లు కూడా జగన్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

అదేదో సినిమా ఫంక్షన్‌లో త్రివిక్రమ్.. పవన్ గురించి చెబుతూ నా ఉప్పెన.. నా ధైర్యం అంటూ పెద్ద ఎలివేషన్ ఇస్తారు. జగన్ కూడా నా సైన్యం అంటూ వాలంటీర్లకు బాహుబలి రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు. కానీ, బటన్ నొక్కే సరికి దాన్ని తుస్సు అనిపించారు. వాలంటీర్లకు ప్రోత్సాహకాల కోసం బటన్లు నొక్కి పది రోజులు అవుతోంది. కానీ, ఆ డబ్బు మాత్రం జమ కాలేదు. అంటే ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పథకాల అంటే.. ఏదో కారణం చెప్పి కోతలు విధిస్తున్నారు. ఆర్థిక భారం తగ్గించు కోవడానికి చాలా దారులు వెతుకుతున్నారు. కానీ.. వాలంటీర్లను ఓటర్లుగా చూడటం లేదు. పథకాల లబ్ధి దారులుగా చూడటం లేదు.

నిజంగానే జగన్ వాలంటీర్లను తన సైన్యంగానే భావిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలను నమ్ముకునే కంటే వాలంటీర్లనే ఎక్కువ నమ్ముకుంటున్నారు. అందుకే ఐదేళ్లుగా వారికి ఇచ్చిన ప్రాధాన్యత పార్టీ నేతలకు ఇవ్వలేదు. ఓటర్లు డేటా వాలంటీర్ల దగ్గర ఉంటుంది దాని సాయంతో అవరమైతే బెదిరింపులకు దిగి అయినా ఓట్లు రాబట్టుకోవచ్చు అని జగన్ అంచనా. కానీ, వాలంటీర్లు నమ్మకంగా పని చేయాలంటే.. వారికి ఎన్నికల ముందు ముడుపులు చెల్లించాలి. దానికి.. సేవామిత్ర, సేవారత్న, సేవవజ్ర పేరుతో ప్రోత్సాహకాలు ఇవ్వాలని అనుకున్నారు. దాని కోసం జగన్ బటన్లు నొక్కారు. కానీ, ఆ బటన్ సరిగా పని చేయలేదో ఏమో.. డబ్బు మాత్రం జమకాలేదు. దీంతో.. జగన్ సైన్యమే ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -