Jensena-YSRCP: వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు జనసేన భయం.. సెక్యూరిటీ టైట్

Jensena-YSRCP: వైసీపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలపై దాడి జరగొచ్చంటూ ఏపీ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని, తెలియననివారిని కలవొద్దంటూ సూచించింది. తమ సమస్యలు చెప్పుకోడానికి అర్జీలు ఇవ్వడానికి వచ్చినట్లు వచ్చి దాడి చేయవచ్చని ఇంటెలిజెన్స్ పోలీసులు హెచ్చరించారు. మంత్రులు., వైసీపీ ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. నేతలందరూ అప్రమత్తంగా ఉండాలని, పర్యటనల సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ పోలీసులు సూచించరాు.

ఇటీవల టెక్కలి కార్యాయలంలో కొంతమంది దుండగులు దాడి చేశారు. 20 మంది అగంతకులు కార్యాయంలోకి చొచ్చుకెళ్లి ఫర్పీచర్ ధ్వంసం చేశారు. కార్యాలయంలోని కుర్చీలు, ఇతర వస్తువులను పగలగొట్టారు. కార్యాలయం మొత్తాన్ని చిందరవందరుగా చేశారు. అయితే వైసీపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారంటూ జనసేన వర్గాలు భావిస్తున్నాయి. దీంతో జనసేన కార్యాలయంపై జరిగిన దాడికి ప్రతీకార చర్యగా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై దాడులకు జనసేన కార్యకర్తలు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో దాడులకు సంబంధించి పోస్టులు పెడుతన్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.

దీంతో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై దాడికి ప్లాన్ చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అర్జీలు ఇవ్వడానికి వచ్చి దాడికి పాల్పడే అవకాశముందనే పోలీసులు హెచ్చరించారు. కాన్వాయ్ వెళుతుప్పుడు అడ్డుపడి దాడికి పాల్పడే అవకాశం కూడా ఉందని పోలీసులు తెలిపారు. దీంతో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు పోలీసులు భద్రత పెంచారు. వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి కార్యాయలంపై దాడి వెనుక కీలక పాత్ర పోషించారని జనసేన నేతలు అంటున్నారు. ఇంటెలిజెన్స్ పోలీసుల హెచ్చరికలతో వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుంది. ఎటువైపు నుంచి దాడి చేస్తారేమోననే భయం వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను వెంటాడుతోంది.

మంత్రి రోజా, అంబటి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ. గుడివాడ అమర్ నాథ్ తో పాటు పలువురు మంత్రులకు ఇంటెలిజెన్స్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఎమ్మెల్యేలలో 13 మందికి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.కొద్దిరోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ వద్ద కారులో వెళుతుండగా.. ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై కొంతమంది రాళ్లతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

ఈ దాడికి జనసేన కార్యకర్తలే కారణమంటూ కొంతమంది జనసేన నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం ఏపీ రాజకీయాల్లో రచ్చకు దారి తీసింది. వైసీపీ సర్కార్ పై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తీరుకు నిరసనగా టీడీపీ, ఇతర పార్టీలతో కూడా కలిసి పోరాటం చేయాలని జగన్ నిర్ణయించారు. విశాఖ ఘటన మరుకవముందే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై మరో దాడి జరగొచ్చంటూ ఇంటెలిజెన్స్ పోలీసులు హెచ్చరించడం కలకలం రేపుతోంది. దీంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రైవేట్ సెక్యూరటీని కూడా పెట్టుకుంటున్నారు. తమ దగ్గరకు వచ్చిన వారిని కూడా కలిసేందుకు భయపడుతున్నారు. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే తమ వద్దరకు వచ్చే వారిని కలుస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -