YSRCP New Manifesto: వైసీపీ కొత్త మేనిఫెస్టోను ప్రకటించకపోవడానికి అసలు కారణాలివేనా.. ప్రజలు నమ్మే ఛాన్స్ లేదుగా!

YSRCP New Manifesto: వైసీపీ మాటలు కోటలు దాటినా.. చేతలు మాత్రం గడపలు దాటడం లేదు. అందుకే ఇదో మ్యానిఫెస్టో… అదిగో మ్యానిఫోస్టో అన్నారు. రోజులు గడుస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కానీ, మ్యానిఫెస్టో మాత్రం విడుదల కావడం లేదు. సిద్దం సభల్లోనే మ్యానిఫెస్టో రిలీజ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. మ్యానిఫెస్టోలో ఏం చెబుతారా? అని ప్రజలు సిద్దం సభలకు భారీగా హాజరైయ్యారు. ఇదిగో.. అదిగో అని ప్రజలను మోసం చేయడం తప్పా.. నాలుగు సిద్దం సభల్లో నాలుగు హామీలు కూడా ఇవ్వలేదు. దీంతో.. ప్రజలు అరిగిపోయిన రికార్డుల్లా చంద్రబాబు, పవన్, లోకేష్ తిట్టడానికే సిద్దం సభలా? అని అనుకునేలా చేశారు. సిద్దం సభలు పోయి మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్రను చేస్తున్నారు. కానీ, కానీ, అక్కడ కూడా కొత్తగా చెప్పిందేమీ లేదు. చంద్రబాబు, పవన్, లోకేష్ ను తిట్టడం తప్పా. మేమంతా సిద్దం సభల్లో అదనంగా ఏమైనా చెబుతున్నారంటే.. అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తున్నారు. అభ్యర్థులంతా చాలా పేదవాళ్లని అంటున్నారు. సిద్దం సభల్లోనే మ్యానిఫెస్టో ఉంటుందని గతంలో సుబ్బారెడ్డిలాంటి నేతలు ప్రకటించారు. ఆ తర్వాత ఉగాదికి ఉంటుందని చెప్పారు. కానీ, ఉగాది కూడా ఎలాంటి హడావుడి లేకుండా సైలంట్ గా పూర్తి చేశారు. మ్యానిఫెస్టో విడుదల చేయలేదు.

అయితే, మ్యానిఫెస్టో విషయంలో వైసీపీ ఎందుకు వెనకడుగు వేస్తోంది అనే విషయంలో కొందరు వైసీపీ నేతలే సంచలన విషయాలు బయటకు చెబుతున్నారు. మ్యానిఫెస్టో విడుదల చేస్తే మరింత ప్రమాదం తప్పదనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు చెబుతున్నారు. కొత్తగా రిలీజ్ చేయబోయే మ్యానిఫెస్టోలో ఏ అంశాన్ని చూసిగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గుర్తు చేసినట్టే అవుతోంది. గత మ్యానిఫెస్టోలో 98 శాతం హామీలు అమలు చేశామని చెబుతున్న వైసీపీ నేతలు కొత్త మ్యానిఫెస్టో విడుదల తర్వాత ప్రజలకు చాలా సమాధానం చెప్పాల్సి వస్తుంది. మద్యపాన నిషేదం అనే అంశం పెడితే.. గతంలో కూడా ఇదే ప్రకటన చేసి.. మద్యాన్ని ఏరులై పారించారని చాలా మంది నిలదీస్తారు. ఒకవేళ అదే మద్యపాన నిషేదం అంశాన్ని పెట్టకపోతే.. మద్యపానంపై వైసీపీ స్టాండ్ ఏంటని అడుగుతారు. ఇలా వైసీపీ గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీపై కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నిరుద్యగులకు జాబ్ క్యాలెండర్, ఉద్యోగులకు సీపీఎస్ రద్దు, మెగా డీఎస్సీ ప్రత్యేకహోదా, పోలవరం లాంటి అంశాలన్ని మళ్లీ చర్చకు వస్తాయి.

ఈ ఎన్నికల్లో రుణమాఫీని ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తారని జోరుగా చర్చ జరుగుతోంది. రైతు రుణమాఫీతో పాటు, డ్వాక్రా రుణమాఫీ కూడా చేస్తానని ఈ ఎన్నికల్లో హామీ ఇస్తారని అంటున్నా. కానీ, ప్రచారమే తప్ప ప్రకటన రావడం లేదు. వాటిపై ప్రకటక చేసే దైర్యం కూడా వైసీపీ చేయడం లేదు. మరో వైపు చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన మ్యానిఫెస్టో ప్రజల్లోకి బాగా వెళ్లిపోయింది. టీడీపీ మ్యానిఫెస్టోతో ఎవరికి ఎంత లాభం అనే అంశంపై ప్రజలకు ఓ క్లారిటీ వచ్చింది. కానీ, వైసీపీ మాత్రం ఇంతవరకూ మ్యానిఫెస్టో విడుదల చేయకుండా తర్జనభర్జన పడుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -