YSRCP Manifesto: మళ్లీ మళ్లీ మేనిఫెస్టోను వాయిదా వేస్తున్న సీఎం జగన్.. మోదీ బాబు భయం మామూలుగా లేదుగా!

YSRCP Manifesto: ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థులను ప్రకటిస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి అభ్యర్థుల జాబితాను ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సిద్ధం సభలను ఏర్పాటు చేశారు కానీ ఎక్కడ కూడా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయలేదు.

జగన్మోహన్ రెడ్డి మార్చి 20 వ తేదీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తారని అందరూ భావించారు. ఇక ఈ మేనిఫెస్టో ఇప్పటికే తయారు అయిందని ఇందులో మార్పులు చేర్పులు కూడా చేశారని తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం మేనిఫెస్టో 20వ తేదీ విడుదల చేయలేదని తెలుస్తోంది. ఇలా జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టో విడుదల వాయిదా వేయడానికి కారణం లేకపోలేదు.

బిజెపి తెలుగుదేశం జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఈ కూటమి కలిసి ఇటివల చిలకలూరిపేటలో ప్రజాగళం అనే పేరిట మొదటి సభను నిర్వహించారు. ఈ సభ ఎంతో మంచి సక్సెస్ అయ్యింది ఇలా ఈ సభ సక్సెస్ కావడంతో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విషయంలో కాస్త వెనకడుగు వేశారని తెలుస్తుంది.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ సెక్స్ పేరిట పెద్ద ఎత్తున ఇంటి ఇంటికి వెళ్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే త్వరలోనే కూటమి మేనిఫెస్టోని కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్సిపి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తే బహుశా ప్రజలలోకి బలంగా తీసుకుపోలేరన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా నిన్న మోడీ సభతో జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడో తెలియని ఆందోళన నెలకొందని అందుకే కూటమి మేనిఫెస్టో విడుదలైన తరువాతనే అందుకు అనుగుణంగా తన మేనిఫెస్టోలో మార్పులు చేసే విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -